ఇతడేం భర్త… ఆవేశంలో కిరోసిన్ పోసుకున్న భార్యకు అగ్గిపెట్టె ఇచ్చాడు…ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యాడు

ఆమెకు అత్తారింట్లో వేధింపులు విసిగిపోయాయి. దీంతో ఆవేశంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఒంటిపై కిరోసిన్ పోసుకున్న ఆమెకు సర్దిచెప్పాల్సిన భర్త..

ఇతడేం భర్త... ఆవేశంలో కిరోసిన్ పోసుకున్న భార్యకు అగ్గిపెట్టె ఇచ్చాడు...ఇప్పుడు అడ్డంగా బుక్కయ్యాడు

Updated on: Dec 18, 2020 | 8:11 AM

ఆమెకు అత్తారింట్లో వేధింపులు విసిగిపోయాయి. దీంతో ఆవేశంలో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో ఒంటిపై కిరోసిన్ పోసుకున్న ఆమెకు సర్దిచెప్పాల్సిన భర్త..అగ్గిపెట్టె ఇచ్చి నిప్పంటించుకునేలా చేశాడు. ఆమె చావుకు కారణమైన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు.  వివరాల్లోకి వెళ్తే..కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని వెంగళరెడ్డినగర్‌కు చెందిన వివాహిత షహీనా కుటుంబ కలహాలతో ఈ నెల 6వ తేదీన ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశారు. 60 శాతం గాయాలతో ఆమెను కర్నూలు హాస్పిటల్‌కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. బంధువుల ఫిర్యాదుతో ఆమె మృతికి కారణమైన భర్త ఫరూక్‌ను గురువారం రాత్రి పోలీసులు అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు స్థానిక ఎస్సై నాగేంద్ర ప్రసాదు తెలిపారు.

Also Read : Online Loan Apps : ప్రాణాలు పోతున్నా పట్టించుకోరేంటి..? యువ ఇంజనీర్‌ను మింగేసిన ఆన్‌లైన్ లోన్ యాప్స్

Loading...
Unable to load recommendations.
Follow Us