Mallanna Bonalu Jatara : మల్లన్న దేవుడి బోనాల జాతర వైభవంగా జరిగింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని పలు గ్రామాల్లో మల్లన్న వేడుకలను ఘనంగా నిర్వహించారు. పండగలో పటాలు, ఒగ్గు కళాకారుల నృత్యాలు, శివసత్తుల పూనకాలు, లక్ష్మీ దేవరల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కాటారం గ్రామపంచాయతీ పరిధిలోని సబ్ స్టేషన్ పల్లిలో పుట్టమలన్న, మర్రిపల్లి నస్తూరుపల్లిలో మల్లికార్జున స్వామి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. ఆయా గ్రామాల్లోని మల్లన్న దేవుని ఆలయాల ఎదుట ఒగ్గు కళాకారులు పెద్ద పటాలు వేశారు. అనంతరం శివసత్తులు, లక్ష్మి దేవరలు డోలువాయిద్యాలు, డప్పుచప్పుళ్ల మధ్య పూనకాలతో భక్తులకు భవిష్యవాణి వినిపించారు.
మహిళలు మల్లన్న దేవుని ఆలయం వద్ద నైవేద్యంతో కూడిన బోనాలు వండి, ఆలయ ప్రదక్షిణ చేసి మల్లన్నకు సమర్పించారు. బోనాల జాతరకు వందలాది మంది భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు. మహదేవపూర్ పరిధిలో కూడా మల్లన్న స్వామికి సోమవారం మహిళలు పెద్ద సంఖ్యలో బోనాలు సమర్పించారు. మండలంలోని వివిధ గ్రామాలతో పాటు పక్కనే ఉన్న మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై మొక్కులు చెల్లించుకున్నారు.
Also Read :
జంగారెడ్డిగూడెంలో హృదయ విదారక ఘటన.. తల్లి మృతదేహంతోనే ఐదు రోజులు జీవనం
భర్త స్నేహితుడితో సాన్నిహిత్యం..కట్టుకున్నవాడిని చంపించిన వైనం..గుత్తిలో దారుణం