మహారాష్ట్రలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిత్యం వేలకు తగ్గకుండా కొత్త కేసులు వెలుగుచూస్తూనే ఉన్నాయి. దేశంలో అత్యధిక కేసులతో మహారాష్ట్ర అగ్రస్థానంలోనే కొనసాగుతుంది. తాజాగా గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,837 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా, ఇవాళ ఒక్క రోజు మహమ్మారి బారినపడి 80 మంది ప్రాణాలను కోల్పోయారు.
అయితే, ఇవాళ కరోనా వైరస్ నుంచి కోలుకొని 4,196 మంది ఇళ్లకు చేరుకున్నారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 18,23,896కు చేరగా.. ప్రస్తుతం 90,557 యాక్టివ్ కేసులు ఉన్నాయి.. రాష్ట్రంలో అత్యధిక కేసులు ముంబైలో మహానగరంలో వెలుగుచూస్తున్నాయి.
Maharashtra reports 3,837 new #COVID19 cases, 4,196 recoveries/discharges, & 80 deaths in the last 24 hours, as per State Health Department
Total cases: 18,23,896
Total recoveries: 16,85,122
Active cases: 90,557
Death toll: 47,151 pic.twitter.com/GUM7tYn7Ik
— ANI (@ANI) November 30, 2020