Maharashtra prisons COVID count: దేశంలో కోవిద్-19 విజృంభిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో కరోనా విలయతాండవం చేస్తోంది. సాధారణ ప్రజలతోపాటు పోలీసులు, జైలు సిబ్బంది, జైళ్లలో ఉన్న ఖైదీలు కూడా కరోనాబారిన పడుతున్నారు. రాష్ట్రంలోని 292 జైళ్లలోని వెయ్యి మంది ఖైదీలకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది జైళ్ల శాఖ ప్రకటించింది. కరోనా సోకినవారిలో 814 ఖైదీలు, 268 మంది జైలు సిబ్బంది కోలుకున్నారని తెలిపింది. కరోనాతో ఆరుగురు ఖైదీలు మరణించారని వెల్లడించింది. జైళ్లలో కరోనా కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జైళ్లను శానిటైజ్ చేస్తున్నారు. అదేవిధంగా కరోనా సోకకుండా అన్ని రకాల ముందుజాగ్రత్తలు తీసుకుంటున్నారు.
Read More:
అమరావతి రైతులకు అన్యాయం జరగదు..!