మహారాష్ట్రలోని పొలిటికల్ క్రైసిస్‌పై సుప్రీం కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. రేపు సాయంత్రం 5 గంటలలోపు అసెంబ్లీలో బలపరీక్ష నిర్వహించాలని..అందుకు సీక్రెట్ బ్యాలెట్ అవసరం లేదని స్పష్టం చేసింది. వెంటనే ప్రొటెం స్పీకర్‌ను నియమించాలని..ఫ్లోర్ టెస్ట్‌ను ప్రత్యక్ష ప్రసారం చేయాలని పేర్కొంది. బలపరీక్ష కంటే ముందే ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అవ్వాలని అత్యున్నత ధర్మాసనం తేల్చి చెప్పింది.
జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం నిన్న వాదనలు విన్నది. తీర్పును ఇవాళ్టికి రిజర్వ్ చేసింది. ఉదయం 10:30 గంటలకు తీర్పు వెలువరించింది. మహారాష్ట్ర సీఎం తరఫున ముకుల్ రోహత్గీ, గవర్నర్ కార్యదర్శి తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, కాంగ్రెస్ తరఫున కపిల్ సిబల్, ఎన్సీపీ తరఫున అభిషేక్ సింఘ్వి, అజిత్ పవార్ తరఫున మనీందర్ సింగ్ వాదనలు వినిపించారు.
సుప్రీం తీర్పు అనంతరం నేతల కామెంట్స్:
బలపరీక్షలో నెగ్గితీరతాం : సీఎం ఫడ్నవీస్
బలపరీక్షలో ఫడ్నవీస్ సర్కార్ కూలిపోవడం ఖాయం: సోనియా గాంధీ
అజిత్ పవర్‌తో వెళ్లిన ఎమ్మెల్యేలు అందరూ తిరిగి వచ్చారు..ప్రభుత్వ కూలలిపోతుంది : శరద్ పవార్