మహారాష్ట్ర సర్కార్ మెడికల్ సీట్ల భర్తీపై కీలక నిర్ణయం తీసుకుంది. వైద్య విద్య కోసం ప్రాంతాల వారిగా అమలులో ఉన్న 70:30 అడ్మిషన్ ప్రక్రియను ఆ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. దీనిపై మంగళవారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో ఆ రాష్ట్ర వైద్య విద్యాశాఖ మంత్రి అమిత్ దేశ్‌ముఖ్ ప్రకటన చేశారు. నీట్ పరీక్షలో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఇక నుంచి వైద్య విద్య అడ్మిషన్లు జరుగుతాయని స్పష్టం చేశారు. ఇకపై 70:30 ఫార్ములా ప్రకారం.. 70 శాతం సీట్లు స్థానిక ప్రాంతవాసులకు, 30 శాతం సీట్లు రాష్ట్రంలోని ఇతర ప్రాంతవారికి గతంలో సీట్లను కేటాయించేవాళ్లు. 70:30 కోటా బదులుగా ఇక నుంచి ఒకే మహారాష్ట్ర, ఒకే మెరిట్ విధానం అమలు అవుతుందని మంత్రి అసెంబ్లీలో తెలిపారు. 70:30 కోటా విధానాన్ని రద్దు చేయాలని చాన్నాళ్లుగా విద్యార్థులు, పేరెంట్స్ డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.గతంలో అమలులో ఉన్న విధానం ప్రకారం మెడికల్ కాలేజీల్లో 70 శాతం సీట్లు స్వంత జిల్లా విద్యార్థులకే కేటాయించేవారు. అయితే మరాఠ్వాడా, విదర్భ ప్రాంతాల్లో తక్కువ సంఖ్యలో మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఇన్నాళ్లూ ఈ ప్రాంత విద్యార్థులు ఇబ్బందిపడ్డారు. ఇప్పుడు ఆ సమస్య తీరనున్నదని మంత్రి అమిత్ దేశ్‌ముఖ్ వెల్లడించారు.
आता वैद्यकीय प्रवेश प्रक्रिया “वन महाराष्ट्र, वन मेरिट” तत्वावर होणार. pic.twitter.com/VCVSAJkzp4
— Amit V. Deshmukh (@AmitV_Deshmukh) September 8, 2020