దేశవ్యాప్తంగా మళ్లీ ప్రబలుతున్న కరోనా వైరస్.. టీకా అందుబాటులోకి రావాలంటూ ఉపముఖ్యమంత్రి పూజలు..

|

Nov 27, 2020 | 8:59 PM

దేశం మొత్తం ప్రబలుతున్న కరోనా మహమ్మారి నుంచి ఎప్పడు విముక్తి దొరకుతుందాని జనం ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు విశ్వవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయి.

దేశవ్యాప్తంగా మళ్లీ ప్రబలుతున్న కరోనా వైరస్.. టీకా అందుబాటులోకి రావాలంటూ ఉపముఖ్యమంత్రి పూజలు..
Follow us on

దేశం మొత్తం ప్రబలుతున్న కరోనా మహమ్మారి నుంచి ఎప్పడు విముక్తి దొరకుతుందాని జనం ఆశగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు విశ్వవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయి. అటు మహారాష్ట్రలో దేశంలో అత్యధిక పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీకా త్వరగా అందుబాటులోకి రావాలని, కొవిడ్-19 లేని ప్రపంచం కోసం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్ గురువారం ప్రత్యేక పూజలు చేశారు. సోలాపూర్‌ జిల్లాలోని భగవాన్‌ విఠల్ ఆలయంలో పూజలు నిర్వహించారు.

‘కరోనా మహమ్మారితో ప్రపంచమంతా ఇబ్బందులు ఎదుర్కొంటోంది. మా పరిస్థితి కూడా అలాగే ఉంది. త్వరగా టీకా అందుబాటులోకి వస్తే..ఈ ప్రపంచం వ్యాధి నుంచి విముక్తి పొందుతుంది’ అని పవార్‌ అన్నారు. కొద్ది నెలల క్రితం రాష్ట్రంలో కొవిడ్-19 పరిస్థితులు అదుపులో ఉన్నట్లే కనిపించాయని, కానీ, గత కొద్ది రోజులుగా వైరస్‌ సెకండ్ వేవ్ కారణంగా బాధితుల సంఖ్య పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సంక్షోభానికి దేవుడు ముగింపు పలుకుతాడని, అయితే, ప్రజలు మాత్రం మాస్కులు ధరించడం, పరిశుభ్రత పాటించాలని ఆయన అన్నారు.