‘మహా’ లో కొనసాగుతున్న కరోనా ఉధృతి

|

Jul 31, 2020 | 10:50 PM

మహారాష్ట్రలో పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరగుతుంది. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా కొత్తగా 10,320 మందికి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

‘మహా’ లో కొనసాగుతున్న కరోనా ఉధృతి
Follow us on

కరోనా వైరస్ తీవ్రత భారత్‌లో మరింతగా పెరుగుతోంది. ఓవైపు రికవరీ కేసులు మెరుగవుతుంటే.. మరోవైపు కరోనా మరణాలు భారీగా నమోదవుతున్నాయి. దేశంలో అత్యధికి కేసులు నమోదవుతున్న మహారాష్ట్రలో పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా గణనీయంగా పెరగుతుంది. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్ర వ్యాప్తంగా ఏకంగా కొత్తగా 10,320 మందికి కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 4,22,118కి పెరిగింది. ఇప్పటి వరకు 2,56,158 మంది కోలుకుని డిశ్చార్జ్ కాగా, రాష్ట్రంలో ఇంకా 1,50,662 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక మరణాల సంఖ్య 15వేలకు చేరువైంది. ఇప్పటి వరకు 14,994 మరణాలు నమోదయ్యాయని ఆ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.

ఇక, రాష్ట్ర రాజధాని ముంబైలో కొత్తగా 1,085 మంది కరోనా వైరస్ బారిన పడ్డట్లు అధికారులు వెల్లడించారు. దీంతో నగరంలో మొత్తం కేసుల సంఖ్య 1,14,284కు చేరుకుంది. ముంబైలో ఇవాళ ఒక్కరోజే 53 మంది కరోనా కాటుకు బలయ్యారు. దీంతో నగరంలో మృతి చెందినవారి సంఖ్య 6,353కు పెరిగింది. ప్రస్తుతం ముంబైలో మహానగరంలో 20,563 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 87,074 మంది కోలుకున్నారు. పాజిటివ్ కేసులతో పాటు మరణాల సంఖ్య కూడా పెరుగుతుండడం మరింత ఆందోళన కలిగిస్తోంది.