దేశ వ్యాప్తంగా రెండో దఫా కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుంది. కొవిడ్ జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు ఎంత చెప్పిన జనంలో మార్పు రావడంలేదు. బహిరంగ ప్రదేశాల్లో భౌతిక దూరంతో పాటు, మాస్కులు తప్పనిసరి అని చూపిస్తున్నప్పటికీ యథావిధిగా వ్యవహరిస్తున్నారు. దీంతో కరోనా మహమ్మారి ధాటికి గురవుతున్నారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో ఉన్న ఓ జ్యువెలరీ షాపులో 31 మందికి కరోనా వైరస్ సోకిందని వైద్యాధికారులు తెలిపారు. దీంతో ఇండ్ మున్సిప్ కార్పోరేషన్ అధికారులు నగరంలో అప్రమత్తత ప్రకటించారు. తాత్కాలికంగా ఆనంద్ జ్యువెలరీ షాపును మూసి .. డిస్ఇన్‌ఫెక్షన్ చేస్తున్నారు. అయితే, ఈ స్టోర్‌ను గత వారం రోజుల నుంచి విజిట్ చేసిన వారి వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. ఈ షాపులోకి వచ్చిన కస్టమర్లు ముందు జాగ్రత్తగా హోంఐసోలేట్ కావాలని అధికారులు సూచిస్తున్నారు. వైరస్ సంక్రమించిన ఉద్యోగులు, కస్టమర్ల గురించి ట్రేసింగ్ ప్రారంభించామని, వారిలో ఎవరికైనా దగ్గు, జలుబు లాంటి లక్షణాలు ఉంటే వెంటనే కొవిడ్ టెస్ట్ చేయించుకోవాలని చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ జాదియా తెలిపారు. మధ్యప్రదేశ్‌లో ఇప్పటి వరకు 1.86 లక్షల మంది కరోనా వైరస్ పరీక్షలో పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆ రాష్ట్రంలో సుమారు 1,200 మంది వైరస్ కాటుకు బలయ్యారు.