AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Part Time Jobs to Students: యూనివర్సిటీ విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ‘కర్మయోగి’ పథకంతో ఉపాధి..

క్యాంపస్ లో చదువుతున్న విద్యార్థులకు లక్నో యూనివర్శిటీ పార్ట్ టైమ్ ఉద్యోగాలు కల్పించే ‘కర్మయోగి పథకం’ను తీసుకువచ్చింది.

Part Time Jobs to Students: యూనివర్సిటీ విద్యార్థులకు బంపర్ ఆఫర్.. ‘కర్మయోగి’ పథకంతో ఉపాధి..
Balaraju Goud
|

Updated on: Jan 06, 2021 | 6:02 PM

Share

Karmayogi Scheme: లక్నో విశ్వవిద్యాలయం విద్యార్థులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. తన క్యాంపస్ లో చదువుతున్న విద్యార్థులకు పార్ట్ టైమ్ ఉద్యోగాలు కల్పించే ‘కర్మయోగి పథకం’ను తీసుకువచ్చింది. ఈ మేరకు లక్నో యూనివర్శిటీ తాజాగా ప్రారంభించింది. కర్మయోగి పథకం ద్వారా ఒక విద్యార్థి సంవత్సరంలో గరిష్ఠంగా రూ.15వేల వరకు సంపాదించవచ్చని లక్నో యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అలోక్ కుమార్ రాయ్ చెప్పారు. తరగతుల తర్వాత రోజుకు ఒక గంట సేపు పార్ట్ టైమ్ ఉద్యోగం చేసేందుకు విద్యార్థులకు అనుమతించనున్నట్లు ఆయన తెలిపారు.

ఒక్కొక్క విద్యార్థికి 50రోజులపాటు 50 గంటలపాటు పనిచేసేందుకు అనుమతించనున్నారు. తరగతి తర్వాత పార్ట్ టైమ్ జాబ్ చేసే విద్యార్థికి గంటకు 150 రూపాయలు చొప్పున చెల్లించాలని నిర్ణయించినట్లు వీసీ తెలిపారు. ప్రస్థుతం లక్నో యూనివర్శిటీ క్యాంపస్ లో చదివే విద్యార్థులకు మాత్రమే పార్ట్ టైమ్ జాబ్ చేసే సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. దీంతో విద్యార్థులకు థియరీతో పాటు అప్రంటీస్ చేసే అవకాశం కలుగుతుందన్న వీసీ అలోక్ కుమార్.. విద్యార్థులకు ఆర్థిక స్వాలంభన దొరుకుతుందన్నారు. లక్నో విశ్వవిద్యాలయం విద్యార్థులకు బంపర్ ఆఫర్ః