ఇండియన్ ఆర్మీకి కొత్త బాస్.. మనోజ్ ముకుంద్

| Edited By:

Dec 17, 2019 | 7:04 AM

ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ వైస్ చీఫ్‌గా పనిచేస్తున్న లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే ఇండియన్ ఆర్మీ చీఫ్‌ గా ఎన్నికయ్యారు. ఈ నెల చివరిలో ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ పదవీ కాలం ముగుస్తుంది. లెఫ్టినెంట్ జనరల్ నరవానే సెప్టెంబర్‌లో ఆర్మీ వైస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు నరవానే చైనా సరిహద్దులో ఉన్న భారత సైన్యం ఈస్ట్రన్ కమాండ్ కు చీఫ్ గా బాధ్యతలు నిర్వహించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ […]

ఇండియన్ ఆర్మీకి కొత్త బాస్.. మనోజ్ ముకుంద్
Follow us on

ప్రస్తుతం ఇండియన్ ఆర్మీ వైస్ చీఫ్‌గా పనిచేస్తున్న లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ ముకుంద్ నరవానే ఇండియన్ ఆర్మీ చీఫ్‌ గా ఎన్నికయ్యారు. ఈ నెల చివరిలో ప్రస్తుత ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ పదవీ కాలం ముగుస్తుంది. లెఫ్టినెంట్ జనరల్ నరవానే సెప్టెంబర్‌లో ఆర్మీ వైస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు నరవానే చైనా సరిహద్దులో ఉన్న భారత సైన్యం ఈస్ట్రన్ కమాండ్ కు చీఫ్ గా బాధ్యతలు నిర్వహించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ మిలిటరీ అకాడమీ యొక్క పూర్వ విద్యార్థి అయిన ముకుంద్ నారావనే, జూన్ 1980 లో 7 వ బెటాలియన్, ది సిక్కు లైట్ ఇన్ఫాంట్రీ రెజిమెంట్‌లో నియమితులయ్యారు.

తన నాలుగు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో, లెఫ్టినెంట్ జనరల్ నారావనే జమ్మూ కాశ్మీర్‌లో సేవలందించారు. ఆపరేషన్ పవన్ సందర్భంగా శ్రీలంకలోని ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్‌లో ఆయన కూడా ఒక భాగం. అతను మయన్మార్‌లోని భారత రాయబార కార్యాలయంలో మూడేళ్లు పనిచేశాడు. సేనా మెడల్, విశిష్ట సేవా మెడల్‌, అతి విశిష్ట సేవాల మెడల్‌లను నరవానే సొంతం చేసుకున్నారు. ఆర్మీ ట్రైనింగ్ కమాండ్ జనరల్ కు కమాండింగ్ ఆఫీసర్ గా చేసిన సేవలకు ఆయనను ప్రభుత్వం ‘పరమ్ విశిష్ట సేవా మెడల్’ తో సత్కరించింది.

[svt-event date=”17/12/2019,7:04AM” class=”svt-cd-green” ]