బ్రేకింగ్.. బెజవాడలో మరో దారుణం

బెజవాడ నగరం దారుణం చోటు చేసుకుంది. ప్రేమోన్మాది పైశాచికత్వానికి మరో యువతి బలైంది. నగరంలోని మాచవరంలో నాగేంద్రబాబు అలియాస్  చిన్న స్వామి అనే ప్రేమోన్మాది  దివ్య తేజస్విని అనే ఇంజనీరింగ్ విద్యార్థినిపై కత్తితో దాడిచేశాడు. కత్తితో ఆమె మెడపై నరకడంతో రక్తమోడుతున్న ఆమె.. చికిత్స పొందుతూ మరణించింది. దాడి తర్వాత తనను తాను కత్తితో గాయపర్చుకున్నాడు ఉన్మాది స్వామి. ప్రస్తుతం స్వామి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం. అతడ్ని హుటాహుటీన గుంటూరు ఆస్పత్రికి తరలించి చికిత్స […]

బ్రేకింగ్..  బెజవాడలో మరో దారుణం

Updated on: Oct 15, 2020 | 2:18 PM

బెజవాడ నగరం దారుణం చోటు చేసుకుంది. ప్రేమోన్మాది పైశాచికత్వానికి మరో యువతి బలైంది. నగరంలోని మాచవరంలో నాగేంద్రబాబు అలియాస్  చిన్న స్వామి అనే ప్రేమోన్మాది  దివ్య తేజస్విని అనే ఇంజనీరింగ్ విద్యార్థినిపై కత్తితో దాడిచేశాడు. కత్తితో ఆమె మెడపై నరకడంతో రక్తమోడుతున్న ఆమె.. చికిత్స పొందుతూ మరణించింది. దాడి తర్వాత తనను తాను కత్తితో గాయపర్చుకున్నాడు ఉన్మాది స్వామి. ప్రస్తుతం స్వామి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు సమాచారం. అతడ్ని హుటాహుటీన గుంటూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.  తేజస్వినిని స్వామి ప్రేమపేరిట కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నట్టు సమాచారం. ప్రేమను నిరాకరించిందని ఏకంగా తేజస్విని ఇంటికెళ్లి మరీ స్వామి ఈ దురాగతానికి పాల్పడ్డాడు.

Loading...
Unable to load recommendations.
Follow Us