తిరుపతిలో శ్రీవారి భక్తుల ఆందోళన, వైకుంఠ ఏకాదశి మొక్కులు తీర్చుకునేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్

|

Dec 23, 2020 | 11:30 AM

తిరుపతిలో శ్రీవారి భక్తుల ఆందోళన కొనసాగుతోంది. సర్వ దర్శనం టోకెన్లు లేని భక్తులకు అనుమతి నిరాకరించడంతో భక్తులు ఆందోనకు దిగారు. అలిపిరి ..

తిరుపతిలో శ్రీవారి భక్తుల ఆందోళన, వైకుంఠ ఏకాదశి మొక్కులు తీర్చుకునేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్
Follow us on

తిరుపతిలో శ్రీవారి భక్తులు ఆందోళనకు దిగారు. సర్వ దర్శనం టోకెన్లు లేని భక్తులకు అనుమతి నిరాకరించడంతో భక్తులు నిరసన చేపట్టారు. అలిపిరి కాలినడక దారి, శ్రీవారి మెట్టుమార్గంలో భక్తులను నిలిపివేశారు. గోవింద మాల ధరించిన భక్తులను అడ్డుకోవడంతో భక్తులంతా నిరసన చేపట్టారు. అలిపిరి, శ్రీనివాస మంగాపురంలో గోవిందమాల ధరించిన భక్తులు వైకుంఠ ఏకాదశి మొక్కులు తీర్చుకునేందుకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.