#Indian locked down లాక్ డౌన్ మంచిదే కానీ… ప్రశాంత్ కిశోర్ గెస్ ఇదే

|

Mar 25, 2020 | 6:50 PM

దేశంలో అమలవుతున్న లాక్ డౌన్‌నై తనదైన శైలిలో స్పందించారు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్. లాక్ డౌన్ నిర్ణయాన్ని సమర్థిస్తూనే ప్రధాన మంత్రి మోదీపై విమర్శలు చేశారు. అయితే.. కరోనా వైరస్ నియంత్రణలో నరేంద్ర మోదీ ఏం చేయాలేదో ప్రశాంత్ కిశోర్ వివరించారు. అందుకే తాను మోదీ ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నానని చెబుతున్నారాయన.

#Indian locked down లాక్ డౌన్ మంచిదే కానీ... ప్రశాంత్ కిశోర్ గెస్ ఇదే
Follow us on

Prashanth Kishore supports Lock down but criticizes Modi: దేశంలో కరోనా ప్రభావం నానాటికీ పెరిగిపోతున్న తరుణంలో లాక్ డౌన్ మినహా మరే ప్రత్యామ్నాయం లేదని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు. అయితే.. 21 రోజుల లాక్ డౌన్ నిర్ణయంతోనే కరోనా అరికడతామని అనుకుంటే పొరపాటని ఆయనంటున్నారు. ప్రధాని తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయాన్ని సమర్థించిన ప్రశాంత్ కిశోర్ మరిన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు.

యావత్ ప్రపంచం కరనా వారిన పడిన తరుణంలో దేశంలో లాక్ డౌన్ ప్రకటించడం కరెక్టేనని ప్రశాంత్ కిశోర్ అన్నారు. అయితే కరోనాను నియంత్రించేందుకు, సరిగ్గా ఎదుర్కొనేందుకు మోదీ ప్రభుత్వం తగిన విధంగా ప్రిపేర్ కాలేదని ఆయన అభిప్రాయపడుతున్నారు. చైనా నుంచి మనదేశానికి యాక్సెస్ వున్న అన్ని అవకాశాలను ముందే అంఛనా వేసి తగిన విధంగా దేశాన్ని సంసిద్దం చేయడంలో మోదీ విఫలమయ్యారని ప్రశాంత్ కిశోర్ అంటున్నారు.

లాక్ డౌన్ 21 రోజులతో ముగిసే అవకాశాలు తక్కువగా వున్నాయని అంటున్న ప్రశాంత్ కిశోర్ నెల రోజులకు పైగా లాక్ డౌన్ కొనసాగే పరిస్థితి కనిపిస్తుందని చెబుతున్నారు. మహమ్మారి విజృంభణ నేపథ్యంలో 21 రోజుల లాక్‌డౌన్‌ పొడిగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అభిప్రాయపడ్డారు. మున్ముందు మరిన్ని కఠినమైన రోజులు చూడాల్సివస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.