‘అవ్వా !నువ్వే జనానికి స్ఫూర్తి’.. ట్వీట్ చేసిన ప్రధాని మోదీ

| Edited By: Pardhasaradhi Peri

Mar 24, 2020 | 7:16 PM

కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్స చేస్తున్న ఆసుపత్రి డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది సేవలకు గాను దేశ ప్రజలంతా ఆదివారం (ఈ నెల 22) సాయంత్రం 5 గంటలకు తమ బాల్కనీల్లో నిలబడి చప్పట్లు కొట్టాలని ప్రధాని మోదీ ఇఛ్చిన పిలుపునకు లక్షలాది జనమంతా స్పందించారు. చప్పట్లు, శంఖ నాదాలతో వారికి అభినందనలు తెలిపారు. అయితే అదే సమయానికి ఒక పేద అవ్వ తన పూరి గుడిసె ముందు తన వణకుతున్న చేతులతోనే సత్తు పళ్లెంలో కొట్టిన […]

అవ్వా !నువ్వే జనానికి స్ఫూర్తి.. ట్వీట్ చేసిన ప్రధాని మోదీ
Follow us on

కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్స చేస్తున్న ఆసుపత్రి డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది సేవలకు గాను దేశ ప్రజలంతా ఆదివారం (ఈ నెల 22) సాయంత్రం 5 గంటలకు తమ బాల్కనీల్లో నిలబడి చప్పట్లు కొట్టాలని ప్రధాని మోదీ ఇఛ్చిన పిలుపునకు లక్షలాది జనమంతా స్పందించారు. చప్పట్లు, శంఖ నాదాలతో వారికి అభినందనలు తెలిపారు. అయితే అదే సమయానికి ఒక పేద అవ్వ తన పూరి గుడిసె ముందు తన వణకుతున్న చేతులతోనే సత్తు పళ్లెంలో కొట్టిన ‘చప్పుళ్ళు’ మోదీకి వినిపించినట్టు  ఉన్నాయి. హైదరాబాద్ లో పార్థు అనే వ్యక్తి ఇంటిముందు ఆ వృధ్ధురాలు చేసిన ఈ పని తాలూకు దృశ్యాన్ని ఆయన ట్విట్టర్లో పోస్ట్ చేయగా.. అది చూసి మోదీ చలించిపోయారు. ‘ఈ తల్లి సెంటిమెంట్లను గౌరవిద్దాం.. ఇళ్లలోనే ఉండి ఆ వైద్య సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుదాం’ అని ఆయన  ట్వీట్ చేశారు.