బెంగాల్ సఫారీ పార్క్‌లో చిరుతపులి మృత్యువాత.. అనారోగ్యమే కారణమంటున్న పార్క్ డైరెక్టర్

|

Dec 21, 2020 | 5:24 PM

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఓ చిరుత పులి మృత్యువాతపడింది. సిలిగురి నగరంలోని బెంగాల్ సఫారీ పార్కులో ఓ మగ చిరుతపులి అనారోగ్యంతో మరణించిందని జూపార్క్ అధికారులు వెల్లడించారు.

బెంగాల్ సఫారీ పార్క్‌లో చిరుతపులి మృత్యువాత.. అనారోగ్యమే కారణమంటున్న పార్క్ డైరెక్టర్
Follow us on

పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఓ చిరుత పులి మృత్యువాతపడింది. సిలిగురి నగరంలోని బెంగాల్ సఫారీ పార్కులో ఓ మగ చిరుతపులి అనారోగ్యంతో మరణించిందని జూపార్క్ అధికారులు వెల్లడించారు. 2018వ సంవత్సరంలో బెంగాల్ టీ తోటల్లో సంచరిస్తుండగా చిరుతపులిని పట్టుకున్న అటవీ అధికారులు.. సిలిగిరి సఫారీ పార్కుకు తరలించారు. ఈ చిరుతపులికి ‘సచిన్’ అని పేరు పెట్టి సఫారీ పార్కులో సందర్శకుల కోసం ఉంచారు. ఈ చిరుతపులి ఆకస్మికంగా అనారోగ్యానికి గురై మరణించిందని సిలిగురి సఫారీ పార్కు డైరెక్టర్ బాదల్ దేబ్నాథ్ చెప్పారు. మరణించిన చిరుతపులి అడవిలో జన్మించినందున దాని వయసు కరెక్ట్‌గా చెప్పలేమని డైరెక్టర్ తెలిపారు. బెంగాల్ సఫారీ పార్కులో మరో జంతువు అనారోగ్యానికి గురవడంతో చికిత్స చేస్తున్నామని డైరెక్టరు వివరించారు.