Lenovo Tab P11 Pro: భారత మార్కెట్లోకి లెనోవో కొత్త ట్యాబ్‌.. ఫీచర్లు చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

|

Oct 15, 2022 | 10:28 AM

ప్రస్తుతం ట్యాబ్లెట్ల వినియోగం భారీగా పెరిగింది. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ విధానం, ఆన్‌లైన్‌లో ఈ బుక్స్‌ చదువుతుండడంతో ట్యాబెట్లను కొనుగోలు చేసే వారి సంఖ్య పెరుగుతోంది. ఈ నేపథ్యంలో లెనోవో కొత్త ట్యాబ్‌ను విడుదల చేసింది. ఇంతకీ ఈ ట్యాబ్‌లో ఉన్న ఫీచర్లు ఏంటి.? ధర ఎంత లాంటి వివరాలు మీకోసం..

1 / 5
లెనోవో ట్యాబ్‌ పీ11 (సెకండ్‌ జనరేషన్‌) ప్రో పేరుతో తీసుకొచ్చిన ఈ ట్యాబ్‌లో 11.2 ఇంచెస్‌ సినిమాటిక్‌ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను అందించారు. డాల్బీ విజన్‌ హెచ్‌డీఆర్‌ ఈ డిస్‌ప్లే ప్రత్యేకతగా చెప్పొచ్చు. డిస్‌ప్లే హెచ్‌డీఆర్‌ 10+కి సపోర్ట్‌ చేయడం విశేషం.

2 / 5
ఈ ట్యాబ్‌ ఆక్టాకోర్‌ మీడియాటెక్‌ కంపానియో 1300 టీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. లెనోవా ప్రెసిషన్ పెన్ 3 వైర్‌లెస్ ఛార్జింగ్, స్టోరేజ్ కోసం డివైజ్‌కు మాగ్నేటికల్‌గా అటాచ్ అవుతుంది. బ్లూటూత్‌ సపోర్ట్‌తో వచ్చే ఈ పెన్ ట్యాబ్లెట్‌తో ఆటో-పెయిర్ అవుతుంది.

3 / 5
ఈ ట్యాబ్‌లో జేబీఎల్‌ క్వాడ్‌ స్పీకర్‌ సిస్టమ్‌ను అందించారు. గూగుల్‌ కిడ్స్‌ స్పేస్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఈ ట్యాబ్‌ను డెస్క్‌టాప్‌ లేదా వైర్‌లెస్‌ టచ్‌ స్క్రీన్‌కి పోర్టబుల్‌ సెకండ్‌ స్క్రీన్‌గా ఉపయోగించుకోవచ్చు

4 / 5
ఈ ట్యాబ్‌ బరువు 480 గ్రాములుగా ఉంది. ఇక కెమెరా విషయానికొస్తే ఇందులో 13 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరాను అందించారు. యూఎస్‌బీ సీ పోర్ట్‌ ఇచ్చారు.

5 / 5
ధర విసయానికొస్తే ఈ 8జీబీ ర్యామ్‌ + 256 జీబీ స్టోరేజ్‌ ధర రూ. 39,999గా ఉంది. అక్టోబర్‌ 17 నుంచి సేల్ మొదలు కానున్న ఈ ట్యాబ్‌ లెనోవో అధికారిక వెబ్‌సైట్‌తో పాటు, అమెజాన్‌లోనూ అందుబాటులో ఉండనుంది.