12 వందల థియేటర్స్‌లో గ్రాండ్‌గా.. సినిమాను ఆపినవారిపై కేసు పెడతా..!

| Edited By:

Dec 11, 2019 | 9:30 PM

మొత్తానికి.. రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన.. ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా గురువారం థియేటర్స్‌లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్‌ను ఇచ్చింది. ఎన్నో ట్విస్టుల నడుమ ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా.. చైనాలో ఉన్న వర్మ మాట్లాడుతూ.. మా సినిమాని ఆపడానికి ఎవరు.. ప్రయత్నించారో వాళ్ళమీద లీగల్‌గా త్వరలోనే కేసులు పెట్టబోతున్నామని.. అసెంబ్లీలో జరుగుతోన్న కామెడీని ఏ డైరెక్టర్ తీయలేడని, ఫైనల్‌గా సినిమా రిలీజ్ అవుతుందని […]

12 వందల థియేటర్స్‌లో గ్రాండ్‌గా.. సినిమాను ఆపినవారిపై కేసు పెడతా..!
Follow us on

మొత్తానికి.. రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన.. ‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమా గురువారం థియేటర్స్‌లో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకి సెన్సార్ బోర్డు U/A సర్టిఫికేట్‌ను ఇచ్చింది. ఎన్నో ట్విస్టుల నడుమ ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. ఈ సందర్భంగా.. చైనాలో ఉన్న వర్మ మాట్లాడుతూ.. మా సినిమాని ఆపడానికి ఎవరు.. ప్రయత్నించారో వాళ్ళమీద లీగల్‌గా త్వరలోనే కేసులు పెట్టబోతున్నామని.. అసెంబ్లీలో జరుగుతోన్న కామెడీని ఏ డైరెక్టర్ తీయలేడని, ఫైనల్‌గా సినిమా రిలీజ్ అవుతుందని ఓ వీడియోలో తెలిపాడు వర్మ.

అలాగే.. ఈ సినిమాకి సహ నిర్మాత నట్టి కుమార్ మాట్లాడుతూ.. మా సినిమాని ప్రపంచవ్యాప్తంగా 1200 థియేటర్స్‌లో రిలీజ్ చేస్తున్నామన్నారు. ఈ రోజు 12 గంటల నుంచి ప్రీమియర్ షోలు పడతాయన్నారు. ఈ సినిమాని ఆపడానికి రెండు రాష్ట్రాల్లో కొంతమంది వ్యక్తులు ప్రత్నించారు. కానీ.. మాకు ముంబాయి నుంచి రివైజింగ్ కమిటీ సెన్సార్ సర్టిఫికెట్ ఇష్యూ చేసింది. దానిని కూడా రాజకీయం చేయాలని చూశారు. కానీ.. అంతిమంగా సినిమా రేపు రిలీజ్ అవుతుంది. ఈ చిత్రం రిలీజ్ అయిన తరువాత రాజకీయామ్ మారబోతోందన్నారు. అలాగే.. సినిమాని ఆపడానికి ప్రయత్నించిన వారిపై లీగల్‌గా వెళ్లబోతున్నామని నట్టికుమార్ పేర్కొన్నారు.

ఇక ఈ సినిమా సమర్పకులు అంజయ్య మాట్లాడుతూ.. వర్మ ఎవరినీ టార్గెట్ చేసి తీయలేదని.. ఇది అందరినీ ఆకట్టుకుంటుందని స్పష్టం చేశారు.