ఆంధ్రప్రదేశ్‌లో ఆలయాలపై జరుగుతున్న దాడుల వెనుక కుట్ర కోణం ఉందన్నారు లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నర్. కృష్ణా జిల్లాలో విగ్రహ ధ్వంసంతో పాటు.. రాజమండ్రిలో జరిగిన ఘటనలోనూ ఒకే ఎలక్ట్రిక్ రంపాన్ని ఉపయోగించినట్లు గుర్తించామన్నారు. రాజమండ్రిలో దాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. అంతర్వేది ఘటన తర్వాత జరిగిన ఘటనలన్నింటినీ పోల్చుతూ దర్యాప్తు చేస్తున్నామన్నారు రవిశంకర్ అయ్యన్నార్.