వెంకయ్య పుస్తకం యువతకు మార్గదర్శనం: అమిత్ షా

| Edited By:

Aug 11, 2019 | 1:55 PM

భారత ఉపరాష్ట్రపతిగా రెండేళ్ల ప్రస్థానంపై వెంకయ్యనాయడు రాసిన లిజనింగ్, లెర్నింగ్.. లీడింగ్ పుస్తకాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో ఆయన తన అనుభవాలను పంచుకున్నారని, అవి నేటి తరం యువతకు ఎంతో ఉపయోగకరమన్నారు అమిత్‌షా. ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు నిర్వహించిన 330 ప్రజాకార్యక్రమాలను ఇందులో  వెల్లడించారు. ఆయన తన ప్రయాణంలో 67 యూనివర్సిటీలు, ప్రముఖ విద్యాలయాలను సందర్శించడం, 60 అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాలు, 52 పుస్తకావిష్కరణలు, 25 సార్లు ప్రత్యేక అంశాలపై మాట్లాడినట్టుగా ఆయన […]

వెంకయ్య పుస్తకం యువతకు మార్గదర్శనం: అమిత్ షా
Follow us on

భారత ఉపరాష్ట్రపతిగా రెండేళ్ల ప్రస్థానంపై వెంకయ్యనాయడు రాసిన లిజనింగ్, లెర్నింగ్.. లీడింగ్ పుస్తకాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో ఆయన తన అనుభవాలను పంచుకున్నారని, అవి నేటి తరం యువతకు ఎంతో ఉపయోగకరమన్నారు అమిత్‌షా.

ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడు నిర్వహించిన 330 ప్రజాకార్యక్రమాలను ఇందులో  వెల్లడించారు. ఆయన తన ప్రయాణంలో 67 యూనివర్సిటీలు, ప్రముఖ విద్యాలయాలను సందర్శించడం, 60 అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమాలు, 52 పుస్తకావిష్కరణలు, 25 సార్లు ప్రత్యేక అంశాలపై మాట్లాడినట్టుగా ఆయన బుక్‌లో రాసారు.  చెన్నై‌లో జరిగిన ఈ పుస్తకావిష్కరణ  కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు.