బంగారం, వెండి ధరల వరుస తగ్గుదలకు బ్రేక్ పడింది. పసిడి ధర మళ్లీ పెరిగింది. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.324 పెరిగి రూ.50,824కు ఎగసింది. ఇంటర్నేషనల్ మార్కెట్లో పసిడి ధర పెరగడమే ఇందుకు కారణం. ఇక వెండి కూడా బంగారం దారిలోని నడిచింది. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ.2,124 పెరిగి రూ.60,536కు చేరింది. అంతర్జాతీయంగా బంగారం ఔన్సు ధర 1873 డాలర్లు ఉండగా.. వెండి 23.10 డాలర్ల వద్ద ఫ్లాట్గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు రికవరీ అవుతుండటం వల్ల.. దేశీయంగానూ పుత్తడి ధరలు పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు.
Also Read :
ప్రభుత్వం ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్
Breaking : తెలంగాణలో తెరుచుకోనున్న బార్లు, పబ్బులు, క్లబ్బులు !