Osmania University: కరోనా వల్ల విలువైన సమయాన్ని వృథా చేసుకున్న విద్యార్థులు ఇప్పుడిప్పుడే ఉన్నత చదువులపై దృష్టి సారిస్తున్నారు. యూనివర్సిటీలు కూడా ఆన్‌లైన్ క్లాసుల నుంచి ఆఫ్‌లైన్ క్లాసులు ప్రారంభించే దశలో ఉన్నాయి. ప్రభుత్వం నిర్ణయం కోసం పలు యూనివర్సిటీలు, కళాశాలల యాజమాన్యం ఎదురుచూస్తుంది.
తాజాగా హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ లా విద్యార్థులకు శుభవార్త తెలిపింది. లాకోర్సులకు సంబంధించిన పరీక్షల ఫీజు చెల్లింపు తేదీని ప్రకటించింది. మూడేండ్ల ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్), ఆరో సెమిస్టర్ బ్యాక్‌లాగ్, ఐదేండ్ల బీఏ ఎల్‌ఎల్‌బీ, బీబీఏ ఎల్‌ఎల్‌బీ, బీకాం ఎల్‌ఎల్‌బీ పదో సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షలకు ఈనెల 12 వరకు ఫీజు చెల్లించ వచ్చని అధికారులు ప్రకటించారు. రూ.200 అపరాధ రుసుముతో ఈ నెల 21 వరకు కళాశాలల్లో ఫీజు చెల్లించవచ్చని తెలిపారు. ఓయూ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల సెమిస్టర్ బ్యాక్‌లాగ్ పరీక్షలతోపాటు ఎంసీఏ ఫలితాలను విడుదల చేసినట్టు ప్రొఫెసర్ శ్రీరాం వెంకటేశ్ తెలిపారు. ఫలితాలను www.osmania.ac.in లో చూసుకోవచ్చన్నారు.