సిద్ధిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్య క్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి లష్కర్ వారం సందర్భంగా రూ.40,16,738 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో ఎ.బాలాజీ తెలిపారు. గత శనివారం రూ. 3,77,031, ఆదివారం రూ.29,65,297, సోమవారం 6,74,410 ఆదాయం ఆర్జిత సేవలు, గదులు, దర్శనాలు, ప్రసాదాల విక్రయం తదితర వాటి ద్వారా మొత్తం రూ.40,16,738 వచ్చినట్లు తెలిపారు. కాగా, కొవిడ్ నిబంధనల అనుగుణంగా ఆలయ వర్గాలు తగు ఏర్పాట్లు చేశాయి.