డబ్‌స్మాష్‌తో ప్రధాని మోదీకి షాక్ ఇచ్చిన లాలూ

| Edited By:

Apr 14, 2019 | 8:53 PM

పట్నా: బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ డబ్‌స్మాష్‌తో ప్రధాని నరేంద్ర మోదీకి షాక్ ఇచ్చారు. 2014 ఎన్నికల సందర్భంగా మోదీ ఇచ్చిన హామీలను లాలూ డబ్‌స్మాష్‌ చేశారు. ఈ వీడియోను తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది. 17 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోలో.. మోదీ అప్పట్లో ఇచ్చిన పలు హామీలకు లాలూ పెదాలు కదిపారు. దేశంలోని ప్రతి పౌరుడు ఉచితంగా […]

డబ్‌స్మాష్‌తో ప్రధాని మోదీకి షాక్ ఇచ్చిన లాలూ
Follow us on

పట్నా: బీహార్ మాజీ సీఎం, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ డబ్‌స్మాష్‌తో ప్రధాని నరేంద్ర మోదీకి షాక్ ఇచ్చారు. 2014 ఎన్నికల సందర్భంగా మోదీ ఇచ్చిన హామీలను లాలూ డబ్‌స్మాష్‌ చేశారు. ఈ వీడియోను తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. దీంతో ఆ వీడియో వైరల్ గా మారింది. 17 సెకన్ల పాటు ఉన్న ఈ వీడియోలో.. మోదీ అప్పట్లో ఇచ్చిన పలు హామీలకు లాలూ పెదాలు కదిపారు.

దేశంలోని ప్రతి పౌరుడు ఉచితంగా రూ.15 నుంచి 20 లక్షలు పొందుతాడు. సోదర సోదరీమణుల్లారా మంచిరోజులు(అచ్చేదిన్ )రాబోతున్నాయి. అనే వ్యాఖ్యలకు హావభావాలిస్తూ.. లాలూ లిప్‌ సింక్‌ ఇచ్చారు. ఇక ఈ వీడియో క్యాప్షన్‌గా రూ.15 లక్షల వేయడం.. అచ్చేదిన్‌ తీసుకురావడం అనేవి మోదీ ఇచ్చిన ఉత్తహామీలు అని పేర్కొన్నారు. అయితే ఈ వీడియో ఎప్పుడు చేశారన్నది మాత్రం తెలియరావడం లేదు. ప్రస్తుతం దాణా కుంభకోణం కేసులో లాలూ జైలు శిక్ష అనుభవిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఆయన దాఖలు చేసుకున్న బెయిల్‌ పిటిషన్‌లను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.