IPL 2020 KXIP vs SRH: ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్‌పై పంజాబ్‌ విజయం

లీగ్‌ మొదటి దశలో పెద్దగా సత్తా చాటలేకపోయిన పంజాబ్ జట్టు...  రెండో అర్ధభాగంలో అదరగొడుతోంది. వరుసగా నాలుగో విజయం సాధించింది.

IPL 2020 KXIP vs SRH: ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్‌పై పంజాబ్‌ విజయం

Updated on: Oct 25, 2020 | 12:04 AM

లీగ్‌ మొదటి దశలో పెద్దగా సత్తా చాటలేకపోయిన పంజాబ్ జట్టు…  రెండో అర్ధభాగంలో అదరగొడుతోంది. వరుసగా నాలుగో విజయం సాధించింది. ఈ క్రమంలో ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. 127 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన హైదరాబాద్‌ను 114కే కుప్పకూల్చింది పంజాబ్. దీంతో 12 పరుగుల తేడాతో నెగ్గింది. ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. బ్యాటింగ్‌కు అనుకూలంగా లేని పిచ్‌పై డేవిడ్‌ వార్నర్‌ (35; 20 బంతుల్లో 3×4, 2×6), విజయ్‌ శంకర్‌ (25; 25 బంతుల్లో 4×4) సాధ్యమైనంత ప్రయత్నం చేశారు. అంతకు ముందు పంజాబ్‌లో నికోలస్‌ పూరన్‌ (32; 28 బంతుల్లో 2×4), కేఎల్‌ రాహుల్‌ (27; 27 బంతుల్లో 2×4, 1×6), క్రిస్‌ గేల్‌ (20; 20 బంతుల్లో 2×4, 1×6) రాణించారు.

Also Read : చనిపోయిన మామయ్యకు రానా హాఫ్ సెంచరీ అంకితం