భారతీయ ప్రయాణికులకు కువైట్ షాక్..!

|

Jul 31, 2020 | 3:41 AM

కువైట్ సర్కార్ భారతీయులకు షాక్ ఇచ్చింది. మన దేశానికి చెందిన ప్రయాణికులను కువైట్ లోకి అనుమతించమని ప్రకటించింది. క‌రోనా వైరస్ విజృంభణ ఇంకా కొనసాస్తుండడంతో ఆయా దేశాలు అంత‌ర్జాతీయ విమాన రాక‌పోక‌ల‌పై నిషేధం విధించాయి.

భారతీయ ప్రయాణికులకు కువైట్ షాక్..!
Follow us on

కువైట్ సర్కార్ భారతీయులకు షాక్ ఇచ్చింది. మన దేశానికి చెందిన ప్రయాణికులను కువైట్ లోకి అనుమతించమని ప్రకటించింది. క‌రోనా వైరస్ విజృంభణ ఇంకా కొనసాస్తుండడంతో ఆయా దేశాలు అంత‌ర్జాతీయ విమాన రాక‌పోక‌ల‌పై నిషేధం విధించాయి. దీంతో విమానయాన సర్వీసులపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఆర్థికంగా కుంగిపోయిన సంస్థలను గాడిలో పెట్టేందుకు మెల్ల మెల్లగా తిరిగి ప్రయాణాలు ప్రారంభించాలని ఆయా దేశాలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా కువైట్ దేశం ఆగ‌స్టు 1వ తేదీ నుంచి అంత‌ర్జాతీయ విమానాల రాక‌పోక‌ల‌ను అనుమ‌తి ఇస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. కువైట్ పౌరుల‌కు, నివాసితుల‌కు బ‌య‌ట‌కు వెళ్లేందుకు, వ‌చ్చేందుకు అనుమ‌తిచ్చింది. అయితే, కువైట్‌లోకి భార‌తీయుల‌ను మాత్రం అనుమ‌తించ‌మ‌ని అక్క‌డి అధికారులు స్ప‌ష్టం చేశారు. భార‌తీయుల‌తో పాటు బంగ్లాదేశ్, ఫిలిఫిన్స్, శ్రీలంక‌, పాకిస్తాన్, ఇరాన్, నేపాల్ దేశాల నుంచి వ‌చ్చే వారికి కూడా అనుమ‌తి లేద‌ని పేర్కొంది. కరోనా వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న దేశాల నుంచి ప్రయాణికులను అనుమతించవద్దని తెలిపింది.