
కరోనాపై అవగాహన కలిగించేందుకు ఇవాళ హైదరాబాద్‌లోని పలు కంటైన్మెంట్ జోన్లలో మంత్రి కేటీఆర్ పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్బంగా పలు చోట్ల ప్రజలతో మాట్లాడిన కేటీఆర్.. కరోనాపై జాగ్రత్తలు చెప్పారు. అలాగే ప్రభుత్వం ఇస్తోన్న సౌకర్యాలు అందుతున్నాయా..? లేదా అంటూ ప్రశ్నించారు. ఈ క్రమంలో ఓ చోట బాలుడితో పాటు సినిమాలో రామ్ చరణ్ తెలుసా..? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. దానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ బాలుడిని నీ పేరేంటి..? అని కేటీఆర్ అడగ్గా.. రామ్ చరణ్ అంటూ ఆ అబ్బాయి సమాధానం ఇచ్చారు. అందుకు ఆ రామ్ చరణ్ తెలుసా..? సినిమాలో రామ్ చరణ్ తెలుసా..? అంటూ ప్రశ్నించారు. దీంతో అక్కడ కాసేపు నవ్వులు పూశాయి. కాగా కేటీఆర్, రామ్ చరణ్ మంచి స్నేహితులన్న విషయం తెలిసిందే.
Read This Story Also: యాక్టింగ్ ఆఫర్.. మణి ఎందుకు వద్దన్నారో తెలిస్తే..!
#KTR interaction with people making awareness #StayHome till May3#lockdown pic.twitter.com/4nRze9umPp
— Sai Kumar® (@saikumar_8007) April 16, 2020