KTR super idea: సీల్డు కవర్‌లో ఛైర్మెన్లు.. కేటీఆర్ పక్కా వ్యూహం

|

Feb 29, 2020 | 10:36 AM

కేటీఆర్ వ్యూహం మార్చారు. సహకార ఎన్నికల తుది ఘట్టంలో సడన్‌గా తన రూటు మార్చారు. ఫిబ్రవరి 29న సహకార ఎన్నికల పర్వానికి తెరపడనున్నది. ఈ నేపథ్యంలో కేటీఆర్ తన వ్యూహం మార్చి పరిశీలకులకు కొత్త పని అప్పగించారు.

KTR super idea: సీల్డు కవర్‌లో ఛైర్మెన్లు.. కేటీఆర్ పక్కా వ్యూహం
Follow us on

KTR has sent names of new chairmen names in sealed cover: టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూపర్ ఐడియా వేశారు. సహకార ఎన్నికల ముగింపు దశలో కేటీఆర్ వ్యూహాత్మకంగా అసమ్మతీయులను, అసంతృప్త వాదులను నియంత్రించేందుకు పక్కా ప్లాన్ వేశారు. ఫిబ్రవరి 29న జరగనున్న డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మెన్ల పేర్లను చివరి నిమిషం దాకా గోప్యంగా వుంచేందుకు వ్యూహం రచించారు.

డిసీసీబి, డీసీఎంఎస్ చైర్మెన్ అభ్యర్థుల ఎంపికపై తెలంగాణ భవన్‌లో పార్టీ ఎన్నికల పరిశీలకులతో కేటీఆర్ శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఎన్నికల పరిశీలకులకు ఛైర్మన్ అభ్యర్థుల పేర్లను సీల్డ్ కవర్‌లో అందజేశారు కేటీఆర్. జిల్లా వారీగా పార్టీ ఎన్నికల పరిశీలకులను ఎంపిక చేశారు. వారిని జిల్లా కేంద్రాలకు తరలి వెళ్ళాల్సిందిగా సూచించారు.

ఉమ్మడి జిల్లాల వారీగా టీఆర్ఎస్ ఎన్నికల పరిశీలకులు:

నిజామాబాద్: మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి.. రంగారెడ్డి: ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్.. వరంగల్: గ్యాదరి బలమల్లు… నల్లగొండ: శేరి సుభాష్ రెడ్డి.. మెదక్: బడుగుల లింగయ్య యాదవ్.. ఖమ్మం: నూకల నరేష్ రెడ్డి… ఆదిలాబాద్: కోలేటి దామోదర్… మహబూబ్ నగర్: బండ ప్రకాష్.. కరీంనగర్: నరదాసు లక్ష్మణ్ రావు..

డీసీసీబీ, డీసీఎంఎస్ ఛైర్మెన్ల పేర్లు వుంచిన సీల్డు కవర్లను కేటీఆర్ జిల్లాల పరిశీలకులకు అందజేశారు. ఫిబ్రవరి 29న ఉదయం 7.30 నిమిషాలకు జిల్లా మంత్రుల సమక్షంలో సీల్డ్ కవర్‌లు ఓపెన్ చేయాలని కేటీఆర్ వారిని ఆదేశించారు. అనంతరం ఎంపిక చేసిన ఛైర్మను గెలిచేలా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్దేశించారు కేటీఆర్.

ఇదీ చదవండి: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిధుల వేట.. ఎందుకంటే? TRS MLAs in funds hunt