TRS MLAs for funds: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిధుల వేట.. ఎందుకంటే?

టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిధుల వేటలో పడ్డారా? రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఇచ్చిన హామీలకు నిధులు లేవని ఎమ్మెల్యేలు భావిస్తున్నారా?

TRS MLAs for funds: టీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిధుల వేట.. ఎందుకంటే?
Follow us

|

Updated on: Feb 29, 2020 | 10:34 AM

TRS MLAs are in funds hunting: టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిధుల వేటలో పడ్డారా? రెండోసారి అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఇచ్చిన హామీలకు నిధులు లేవని ఎమ్మెల్యేలు భావిస్తున్నారా? రాబోయే బడ్జెట్ సమావేశాల్లో నైనా తమ నియోజకవర్గాలకు నిధులు రాబట్టేలా ఇప్పటి నుంచే కసరత్తు చేస్తున్నారా? అంటే అవువనే సమాధానం విన్పిస్తోంది. నిధుల కోసం బడ్జెట్‌ వైపు గులాబీ ఎమ్మెల్యేలు చూస్తున్నారట.

టిఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వరుస ఎన్నికలు రావడంతో ఎమ్మెల్యేలంతా బిజీ బిజీ అయ్యారు. ఎంపీ, స్థానిక సంస్థల ఎన్నికల బిజీలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పెద్దగా పట్టించుకోలేదు. ఈ సంవత్సర కాలంలో కొత్త పనులు కూడా ఏమీ చెప్పట్లేదు. గతంలో చేసిన పనులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. బడ్జెట్ సమావేశాలు సమీపిస్తుండడంతో నియోజకవర్గాలకు నిధులు రాబట్టేందుకు ఆర్థిక మంత్రి హరీష్ రావు చుట్టూ తిరుగుతున్నారు ఎమ్మెల్యేలు.

మార్చి మొదటి వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. దీంతో ఎమ్మెల్యేలు నియోజకవర్గాలను వదిలి హైదరాబాద్ బాట పడుతున్నారు. ప్రధానంగా రోడ్లు, త్రాగునీరు డ్రైనేజీ ఇలాంటి సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యేలు నిధులు అడుగుతున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎమ్మెల్యేలకు నియోజకవర్గ అభివృద్ధి నిధుల కింద ఏడాదికి మూడు కోట్ల రూపాయల ఫండ్ ను కేటాయిం చేవారు. టిఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఈ ఫండ్ ను ఎమ్మెల్యేలకు కేటాయించలేదు. దీంతో గ్రామాలకు వెళ్లినప్పుడు చిన్న చిన్న సమస్యలకు కూడా ఎమ్మెల్యేలు తీర్చలేక పోతున్నారు. మున్సిపల్ ఎన్నికల సమయంలోనూ ఎమ్మెల్యేలు ప్రచారానికి వెళ్లిన సమయంలో ప్రజలు తమ నిరసన లను తెలియజేశారు. ఇక అన్ని ఎన్నికలు ముగిసి పోవడంతో ఇప్పుడు ప్రజల్లోకి వెళ్తే అభివృద్ధి పనుల మీద నిర్వహిస్తారని ఎమ్మెల్యేలు భావిస్తున్నారు. అందుకోసం బడ్జెట్లో నియోజకవర్గాలకు నిధులు భారీగా కేటాయించాలని కోరుతున్నారు.

అరణ్య భవన్‌లో బడ్జెట్ ప్రిపరేషన్ కోసం మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నారు. అధికారులను పిలిచి శాఖల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యేలు కూడా అరణ్య భవన్ కు వెళ్లి మంత్రిని కలిసి వినతి పత్రాలు ఇస్తున్నారు. తమ నియోజకవర్గంలో పెండింగ్ పనుల జాబితాను వాటి ఎస్టిమేషన్లు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అన్నింటిని మంత్రితో చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే నిధుల విడుదల తన చేతిలో ఏం లేదని….సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఫండ్స్‌ కేటాయింపు ఉంటుందని హరీష్‌రావు చెబుతున్నారట. దీంతో అరణ్యభవన్‌ నుంచి ప్రగతి భవన్‌లో ఎమ్మెల్యేలు వినతులు సమర్పించుకుంటున్నారట.

ఇదీ చదవండి: సీల్డు కవర్‌లో ఛైర్మెన్లు.. కేటీఆర్ పక్కా వ్యూహం KTR adopted new strategy

ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
ఎల్‌టీఏ మినహాయింపు కావాలా? రెండు రోజుల్లో ఆ పని చేయడం మస్ట్
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
విరూపాక్ష డైరక్టర్‌‌తో అక్కినేని యంగ్ హీరో..
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
హార్దిక్‌కు మద్దతుగా సోనూసూద్.. ట్రోలర్స్‌కు హిత బోధ..ఏమన్నాడంటే?
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
యూట్యూబ్‌ భారీ షాక్‌.. 9 మిలియన్లకు పైగా వీడియోల తొలగింపు.. కారణం
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
51ఏళ్ల వయసులో క్రికెట్‌తో అదరగొట్టిన కేంద్ర మంత్రి ఆరోగ్య మంత్రి.
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఎన్నికల సమరంలో తారాతీరం.. క్రీడాలోకం.. ప్రచారమే కాదు.. పోటీకీ సై
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
ఐటీఆర్ మిస్‌మ్యాచ్ అయిన వాళ్లకు షాక్..!
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
అమ్మబాబోయ్.. ఏం వయ్యారం..! తల్లిని మించిన అందంతో..
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
ఎన్‌పీఎస్‌ లేదా మ్యూచువల్ ఫండ్ రిటైర్‌మెంట్‌కు ఏది బెటర్?
మీన రాశిలో శుక్రుడు సంచారం.. ఆ రాశుల వారికి సుఖ సంతోషాలు
మీన రాశిలో శుక్రుడు సంచారం.. ఆ రాశుల వారికి సుఖ సంతోషాలు