Free Vegetable Market: కోవిద్-19 విజృంభిస్తోంది. ఈ వైరస్ ధాటికి ఆర్థిక వ్యవస్థలన్నీ కుదేలయ్యాయి. దేశ వ్యాప్తంగా ప్రజా జీవితం అల్లకల్లోలం అయింది. ముఖ్యంగా చాలా మందికి ఆదాయ మార్గాలు మూసుకుపోవడంతో ఆకలి కేకలు పెరిగాయి. పట్టెడన్నం కోసం ప్రజలు పడుతున్న కష్టాలు అంతా ఇంతా కాదు. అయితే వీరికి ఉచితంగా కూరగాయలు అందజేయడానికి ఓ మార్కెట్ వెలిసింది. అక్కడికి వెళితే ఎవరికి అవసరమైన కూరగాయలు, ఎంత మొత్తంలో కావాలనుకున్నా సరే తీసుకెళ్లవచ్చు.
వివరాల్లోకెళితే.. కోల్‌కతాలో ఉన్న జాదవ్‌పూర్ ప్రాంతంలో .. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్కిస్ట్) ఆధ్వర్యంలో ఈ మార్కెట్ ఏర్పాటు చేశారు. కాగా.. సమీప ప్రాంతంలోని వాలంటీర్లు తమ సహాయసహకారాలను అందిస్తున్నారు. కరోనా లాక్‌డౌన్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారందరికీ చేయూతనిచ్చేందుకు ఈ ప్రయత్నం చేశామని వారు చెబుతున్నారు. మార్కెట్ గేట్ వద్ద ఒక కూపన్‌తో పాటు, సంచి, తమకు కావాల్సిన కూరగాయాల లిస్ట్ తీసుకోవాలి. అనంతరం ఆ లిస్ట్ చూపిస్తే.. మార్కెట్‌లో ఉన్న వాలంటీర్లు సరుకులు ఇస్తారని కమిటీ పేర్కొంది.
[svt-event date=”20/05/2020,5:59PM” class=”svt-cd-green” ]
CPIM Jadavpur Area Committee has arranged for a vegetable market in the Regent estate area where you don’t have to pay anything to get the vegetables. This is a small initiative to stand beside the people during this pandemic.#WestBengal #COVID19 pic.twitter.com/xcwHU70c9n
— ???????? (@sanchita_kundu_) May 18, 2020