దుర్గాపూజా ఉత్సవాలు, పీపీఈ కిట్లతో ‘దాండియా’ నృత్యాలు

| Edited By: Pardhasaradhi Peri

Oct 22, 2020 | 10:25 PM

కోల్ కతా లోని దుర్గా పూజా క్లబ్ అనే సంస్థ పీపీఈ కిట్లు ధరించిన డ్యాన్సర్లతో ‘దాండియా’ నృత్యాన్ని నిర్వహించింది. వివేకానంద స్పోర్టింగ్ క్లబ్ అనే ఈ సంస్థ ఇలా వినూత్నంగా దీన్ని నిర్వహించడం అనేకమందిని ఆకర్షించింది. కోవిడ్ ప్రోటోకాల్ ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకే ఈ సరికొత్త ‘ప్రయోగాన్ని’ చేపట్టామని ఈ క్లబ్ సభ్యులు తెలిపారు. అయిదు రోజులపాటు ఇలాగే పీపీఈ కిట్లతో డ్యాన్సర్లు మెప్పిస్తారని వారు చెప్పారు. వీరు మాస్కులు, గ్లాసెస్, క్యాప్స్ కూడా […]

దుర్గాపూజా ఉత్సవాలు, పీపీఈ కిట్లతో దాండియా నృత్యాలు
Follow us on

కోల్ కతా లోని దుర్గా పూజా క్లబ్ అనే సంస్థ పీపీఈ కిట్లు ధరించిన డ్యాన్సర్లతో ‘దాండియా’ నృత్యాన్ని నిర్వహించింది. వివేకానంద స్పోర్టింగ్ క్లబ్ అనే ఈ సంస్థ ఇలా వినూత్నంగా దీన్ని నిర్వహించడం అనేకమందిని ఆకర్షించింది. కోవిడ్ ప్రోటోకాల్ ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకే ఈ సరికొత్త ‘ప్రయోగాన్ని’ చేపట్టామని ఈ క్లబ్ సభ్యులు తెలిపారు. అయిదు రోజులపాటు ఇలాగే పీపీఈ కిట్లతో డ్యాన్సర్లు మెప్పిస్తారని వారు చెప్పారు. వీరు మాస్కులు, గ్లాసెస్, క్యాప్స్ కూడా ధరించి ఈ దాండియాలో పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్ లో  చాల,మంది మహిళలతో బాటు కొందరు యువకులు కూడా ఉత్సాహంతో దాండియా డ్యాన్సులు చేస్తారు.