కోహ్లీకి రెస్ట్.. రోహిత్‌కు కెప్టెన్సీ!

|

Oct 25, 2019 | 8:03 AM

బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20, టెస్ట్ సిరీస్‌లకు భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. గురువారం ఎమ్‌ఎస్‌కే ప్రసాద్ నేతృత్వంలో సమావేశమైన సెలెక్షన్ కమిటీ.. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చి.. అతని స్థానంలో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు సారధ్య బాధ్యతలను అప్పగించారు. అయితే టెస్ట్ సిరీస్‌కు మాత్రం ఎలాంటి మార్పులు చేయకుండా సఫారీలతో తలబడిన జట్టునే ఎంపిక చేశారు. ఇదిలా ఉండగా దేశవాళీ క్రికెట్‌లో సత్తాచాటిన యువ క్రికెటర్లకు ఈసారి జట్టులో స్థానం కల్పించారు. రీసెంట్‌‌గా డబుల్ […]

కోహ్లీకి రెస్ట్.. రోహిత్‌కు కెప్టెన్సీ!
Follow us on

బంగ్లాదేశ్‌తో జరగనున్న టీ20, టెస్ట్ సిరీస్‌లకు భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. గురువారం ఎమ్‌ఎస్‌కే ప్రసాద్ నేతృత్వంలో సమావేశమైన సెలెక్షన్ కమిటీ.. రెగ్యులర్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి విశ్రాంతినిచ్చి.. అతని స్థానంలో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మకు సారధ్య బాధ్యతలను అప్పగించారు. అయితే టెస్ట్ సిరీస్‌కు మాత్రం ఎలాంటి మార్పులు చేయకుండా సఫారీలతో తలబడిన జట్టునే ఎంపిక చేశారు.

ఇదిలా ఉండగా దేశవాళీ క్రికెట్‌లో సత్తాచాటిన యువ క్రికెటర్లకు ఈసారి జట్టులో స్థానం కల్పించారు. రీసెంట్‌‌గా డబుల్ సెంచరీతో అదరగొట్టిన సంజూ శాంసన్,  ముంబై ఆల్‌రౌండర్ శివమ్ దూబే‌లను ఎంపిక చేసిన కమిటీ.. అనూహ్యంగా టీ20 జట్టులో నవదీప్ సైనీకి ఉద్వాసన పలికి.. అతని స్థానంలో శార్దూల్ ఠాకూర్‌కు చోటు కల్పించారు.

మరోవైపు కృనాల్ పాండ్యా తన స్థానాన్ని నిలుపుకోగా.. చాహల్ తిరిగి జట్టులోకి వచ్చాడు. అటు లెగ్‌ స్పిన్నర్‌ రాహుల్‌ చాహర్‌, ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌, పేసర్‌ ఖలీల్‌ అహ్మద్‌, దీపక్‌ చాహర్‌లకు కూడా మరో అవకాశం ఇచ్చారు.