Virat Kohli Angry Moment: కోహ్లీ దురుసుతనాన్ని భూతద్ధంలో పెట్టి చూడలేం.. విలియమ్సన్‌

|

Mar 03, 2020 | 2:01 PM

Kohli Angry Moment: న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా 0-2తో వైట్ వాష్ అయిన సంగతి తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్‌లలో పూర్తిగా చేతులెత్తేసిన కోహ్లీసేన టెస్ట్ ఛాంపియన్‌‌షిప్‌లో వరుసగా రెండు ఓటములను చవి చూసింది. ఇదిలా ఉంటే మైదానంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రవర్తించిన తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. అటు టెస్ట్ ముగిసిన తర్వాత జరిగిన మీడియా సమావేశంలో కూడా జర్నలిస్ట్‌తో కోహ్లీ వాగ్వాదానికి దిగడంతో ఇప్పుడు కోహ్లీ ప్రవర్తనపై సోషల్ […]

Virat Kohli Angry Moment: కోహ్లీ దురుసుతనాన్ని భూతద్ధంలో పెట్టి చూడలేం.. విలియమ్సన్‌
Follow us on

Kohli Angry Moment: న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా 0-2తో వైట్ వాష్ అయిన సంగతి తెలిసిందే. బ్యాటింగ్, బౌలింగ్‌లలో పూర్తిగా చేతులెత్తేసిన కోహ్లీసేన టెస్ట్ ఛాంపియన్‌‌షిప్‌లో వరుసగా రెండు ఓటములను చవి చూసింది. ఇదిలా ఉంటే మైదానంలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రవర్తించిన తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి. అటు టెస్ట్ ముగిసిన తర్వాత జరిగిన మీడియా సమావేశంలో కూడా జర్నలిస్ట్‌తో కోహ్లీ వాగ్వాదానికి దిగడంతో ఇప్పుడు కోహ్లీ ప్రవర్తనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అయితే మ్యాచ్ అనంతరం కోహ్లీ తీరుపై కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను ప్రశ్నిస్తే.. ఓ చిరునవ్వు నవ్వుతూ అది విరాట్ విలక్షణమైన తీరని బదులిచ్చాడు. ఆటపై విరాట్‌కున్న పిచ్చికి అది నిదర్శనం. మైదానంలో జరిగిన ఘటనను తామెప్పుడూ భూతద్ధంలో పెట్టి చూడమని ఎంతో ప్రశాంతంగా జవాబిచ్చాడు.

అంతేకాకుండా టెస్టు సిరీస్ విజయంపై కూడా స్పందించిన కేన్.. ‘రెండు టెస్టుల్లో విజయం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని చెప్పుకొచ్చారు. విజయాల్లో బౌలర్లు కీలక పాత్రలు పోషించారని.. ఓడిపోయినా కూడా భారత్‌ అద్భుతమైన జట్టు అని కొనియాడాడు. అటు ప్రపంచస్థాయి జట్టును ఓడించడం తమకు సంతృప్తినిచ్చిందని విలియమ్సన్ తెలిపాడు. ఇక ఎప్పటిలానే నెటిజన్లు విలియమ్సన్ కూల్ బిహేవియర్‌కు ప్రశంసలు కురిపించారు.

For More News:

హైదరాబాద్‌లో ఇంటి వద్దకే భోజనం.. కేవలం రూ.5 మాత్రమే.!

రైళ్లలో రేప్‌లు.. విస్తుపోయే నిజాలు.!

అందంగా లేనేమో.. అందుకే తప్పించారేమో.. సమీరా కామెంట్!

రౌడీగారు.. మరీ ఇంత నాటీనా.?

మహేష్ బాబు వీరాభిమాని మృతి.. కారణమిదేనా.?

టెస్ట్ ఛాంపియన్‌షిప్.. కోహ్లీసేనకు ముందుంది ముసళ్ల పండగ..!

మీకు ఐఆర్‌సీటీసీ అకౌంట్ ఉందా.? అయితే ఇది మీకోసమే.?

మృతి చెందిన టీచర్ ‘సస్పెన్షన్’.. బీహార్ విద్యాశాఖ నిర్వాకం.!