మూడో టెస్టు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. మంచి ఫామ్‌లో ఉన్న భారత ఆటగాడు కేఎల్ రాహుల్ గాయపడ్డాడు. మూడో టెస్టు సన్నాహాల్లో భాగంగా నెట్స్‌లో సాధన చేస్తున్న సందర్భంలో రాహుల్ ఎడమ చేతి మణికట్టుకు గాయమైంది.
బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంలో ఈ గాయమైంది. గాయం తీవ్రత అధికంగా ఉండడంతో బోర్డర్ గవాస్కర్ టోర్నీలోని చివరి రెండు టెస్టులకు రాహుల్ అందుబాటులో ఉండడని టీమ్ మ్యానేజ్‌మెంట్ తెలిపింది. కాగా రాహుల్ తిరిగి కోలుకోవడానికి మూడు వారాల సమయం పట్టే అవకాశం ఉందని ఫిజియో తెలిపారు. దీంతో రాహుల్ స్వదేశానికి తిరిగి రానున్నాడు. అయితే రాహుల్ బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో చికిత్స, విశ్రాంతి తీసుకోనున్నాడు.