మొన్నామధ్య ఓ ఆవు రెండు తలల దూడకు జన్మనిచ్చింది. ఆ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారి తెగ చక్కర్లు కొట్టింది. కొందరైతే, ఆ వీడియోను షేర్ చేయాలని, అలా చేస్తే మీకు శుభం కలుగుతుందనే ప్రచారం కూడా చేశారు. అలాగే, మనుషుల్లోనూ అప్పుడప్పుడు రెండు తలల శిశువు జన్మించినట్లుగా వార్తలు వింటుంటాం. కానీ, తాజాగా షోషల్ మీడియాలో రెండు తలలతో ఉన్న పిల్లి వీడియో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.ఈ పిల్లిని పెంచుకుంటున్న డాక్టర్ రాల్ఫ్ ట్రాన్.. ఈ పిల్లి జన్మించి నాలుగు నెలలు అయినట్టు చెప్పారు. రెండు తలలతో పుట్టడంతో.. పిల్లి తల్లి ఈ పిల్లిని దగ్గరకు రానీయక పోవడంతో తాను పెంచుకుంటున్నట్టు పేర్కొన్నారు. క్రానియోఫేషియల్ డూప్లికేషన్ అనే అరుదైన డిఫెక్ట్ కారణంగా డూయో ఇలా రెండు తలలతో జన్మించినట్టు డాక్టర్ రాల్ఫ్ తెలిపారు. ఈ డిఫెక్ట్‌తో పుట్టిన పిల్లి వారానికి మించి బతికింది లేదని.. డుయో మాత్రం నాలుగు నెలల తరువాత కూడా పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు రాల్ఫ్ ఆనందం వ్యక్తం చేశారు. రాల్ఫ్ ఈ పిల్లికి డుయో అని నామకరణం కూడా చేశారు. అయితే, సాధారణంగా ఇటువంటి డిఫెక్ట్‌తో పుట్టిన పిల్లి వారానికి మించి బతకవని చెబుతున్నారు. కానీ, డుయో మాత్రం నాలుగు నెలల తరువాత కూడా పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు రాల్ఫ్ ఆనందం వ్యక్తం చేశారు. డుయోకు రెండు తలలు, రెండు నోర్లు ఉండటంతో.. రెండు నోళ్ల నుంచి రెండు సార్లు మియావ్ అంటూ పిలుస్తోంది. ఈ పిలుపుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. డుయో రెండు తలలతో తింటూ..ఇంకో పిల్లితో ఆడుకుంటున్న వీడియోను మీరు చూడండి…