జాన్ ఎఫ్ కెనెడీతో తనను పోల్చుకున్న కిమ్ !

| Edited By: Pardhasaradhi Peri

Apr 25, 2020 | 4:52 PM

నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ ఆరోగ్యం చాలా విషమంగా ఉందని, ఆయన జాడ కనిపించడం లేదని వార్తలు వస్తున్నవేళ .. ఆయన లైఫ్ పై ఓ రచయిత్రి రాసిన పుస్తకం ఇప్పుడు హాట్ కేకుల్లా అమ్ముడు పోవడానికి సిధ్ధంగా ఉంది. కిమ్ తనను అమెరికా మాజీ నేత జాన్ ఎఫ్ కెనెడీతో పోల్చుకున్నాడని, అలాగే తన భార్య రీ సోల్ జూ ను కెనెడీ వైఫ్ జాకీ తోను పోల్చుకున్నాడని సి ఐ ఏ మాజీ ఎనలిస్ట్.. […]

జాన్ ఎఫ్ కెనెడీతో తనను పోల్చుకున్న కిమ్ !
Follow us on

నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ ఆరోగ్యం చాలా విషమంగా ఉందని, ఆయన జాడ కనిపించడం లేదని వార్తలు వస్తున్నవేళ .. ఆయన లైఫ్ పై ఓ రచయిత్రి రాసిన పుస్తకం ఇప్పుడు హాట్ కేకుల్లా అమ్ముడు పోవడానికి సిధ్ధంగా ఉంది. కిమ్ తనను అమెరికా మాజీ నేత జాన్ ఎఫ్ కెనెడీతో పోల్చుకున్నాడని, అలాగే తన భార్య రీ సోల్ జూ ను కెనెడీ వైఫ్ జాకీ తోను పోల్చుకున్నాడని సి ఐ ఏ మాజీ ఎనలిస్ట్.. జంగ్ హెచ్ ప్యాక్ రాసిన పుస్తకంలో తెలిపింది.’ బికమింగ్ కిమ్ జాంగ్ ఉన్.. ఎ ఫార్మర్ సీఐఏ ఆఫీసర్, ఇన్ సైట్స్ ఇంటూ నార్త్ కొరియా ఎనిగ్ మాటిక్ యంగ్ డిక్టేటర్’ అనే ఈ బుక్ లో ఆమె..అసలు ఈ ఇద్దరు వ్యక్తిత్వాల మధ్య చాలా వ్యత్యాసం ఉందని, కెనెడీకి, కిమ్ కి మధ్య పోలికే లేదని అభిప్రాయపడింది.  కెనెడీ మసాచ్యూసెట్స్ లో డెమొక్రాట్ పొలిటికల్ లీడర్ అయితే.. కిమ్ గ్రాండ్ ఫాదర్ ఓ నేషనలిస్ట్ గెరిల్లా అని ఆమె పేర్కొంది. కెనెడీ తన భార్యను ఎలా ప్రేమించేవాడో కిమ్ కూడా తన సతీమణి రీ సోల్ ని గాఢంగా అభిమానించేవాడని వెల్లడించింది.  కెనెడీ డైనమిక్ పాలన తనకు ఎంతగానో నచ్చిందని కిమ్ తరచూ తన సన్నిహితులతో అంటుండేవారని ప్యాక్ తెలిపింది. కాగా కిమ్ ఆచూకీ ఎక్కడో అత్యంత రహస్యంగా ఉన్న ఈ పరిస్థితుల్లో కొరియన్ వాసులు ఈ పుస్తకాన్ని చదివేందుకు తహతహలాడుతున్నారు.