AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆన్‌లైన్‌లో ఖైరతాబాద్ గణపయ్య దర్శనం

కరోనా వ్యాప్తి కారణంగా దేశ వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో పూజా కైంర్యాలు ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. ఇప్పుడు ఇదే పద్దతిని ఖైరతాబాద్ గణపయ్య దర్శనం కల్పిస్తున్నారు. ఇందు కోసం స్వామివారికి జరిగే సేవలను..

ఆన్‌లైన్‌లో ఖైరతాబాద్ గణపయ్య దర్శనం
Sanjay Kasula
|

Updated on: Aug 24, 2020 | 10:14 AM

Share

కరోనా వ్యాప్తి కారణంగా దేశ వ్యాప్తంగా ఉన్న ఆలయాల్లో పూజా కైంర్యాలు ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. ఇప్పుడు ఇదే పద్దతిని ఖైరతాబాద్ గణపయ్య దర్శనం కల్పిస్తున్నారు. ఇందు కోసం స్వామివారికి జరిగే సేవలను డిజిటిల్ ద్వారా ఖైరతాబాద్ ఉత్సవ కమిటీ ప్రత్యేక్ష ప్రసారం చేస్తున్నారు. ఖైరతాబాద్‌ గణపతిని ఆన్‌లైన్‌లో దర్శించుకోవాలని భక్తులను ఉత్సవ కమిటీ సూచించింది. www.ganapathideva.org వెబ్‌సైట్లో ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకూ, సాయంత్రం 5 నుంచి 9గంటల వరకూ ఉచిత దర్శన సదుపాయం కల్పించామని వెల్లడించారు.

ఆన్‌లైన్‌లో గోత్రనామాలు నమోదు చేసుకుంటే.. స్వామి వారికి సేవలు నిర్వహిస్తామని ఉత్సవ కమిటీ ఛైర్మన్‌ సింగరి సుదర్శన్‌ పేర్కొన్నారు. మండపం వద్దకు వస్తే దూరం నుంచి దర్శించుకోవడం మినహా ఇవేమీ ఉండవని అన్నారు. కోవిడ్  ఆంక్షల దృష్ట్యా ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని ఆయన విజ్ఞప్తి చేశారు. కానుకలు కూడా ఆన్‌లైన్‌లోనే సమర్పించొచ్చని పేర్కొన్నారు.

వినాయక చవితి రోజైన శనివారంతోపాటు ఆదివారం కూడా ధన్వంతరీ నారాయణ మహా గణపతిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. తొలి రోజున ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌, కార్పొరేటర్‌ విజయారెడ్డి, భాగ్యనగర్‌ గణేష్‌ ఉత్సవ కమిటీ కార్యదర్శి భగవంతరావు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్దన్‌రెడ్డితోపాటు పలువురు ప్రముఖలు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మియాపూర్‌ మిఠాయి వర్తకుడు మరమరాలతో చేసి సమర్పించిన 5అడుగుల వినాయకుడు.. ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షులు మహేష్‌ యాదవ్‌, తాపేశ్వరం సురుచి ఫుడ్స్‌ అధినేత మల్లిబాబు సమర్పించిన లడ్డూలు ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. సాంస్కృతిక ప్రదర్శనలతో ఊరేగింపుగా వచ్చిన ఒగ్గు డోలు కళాకారులు.. గణపతికి 18అడుగుల జంధ్యం, 18అడుగుల చేనేత కండువా, పట్టువస్త్రాలు, గరిక మాలలను సమర్పించారు. ఐఏఎస్‌ అధికారి చిరంజీవులు, సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ పాల్గొని పూజలు నిర్వహించారు.

Follow Us
టెస్ట్ అరంగేట్రంలోనే అదరగొట్టిన టాప్ ఇండియన్ క్రికెటర్లు వీరే
టెస్ట్ అరంగేట్రంలోనే అదరగొట్టిన టాప్ ఇండియన్ క్రికెటర్లు వీరే
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగరిపడుతున్న మంటలు
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగరిపడుతున్న మంటలు
నేటి నుంచి ఈ రాశుల వారికి అదృష్ట జాక్‌పాట్.. ధనలాభం, ప్రమోషన్..
నేటి నుంచి ఈ రాశుల వారికి అదృష్ట జాక్‌పాట్.. ధనలాభం, ప్రమోషన్..
24 గంటల్లోనే రిజిస్ట్రేషన్.. వాహనదారులకు రిలీఫ్..
24 గంటల్లోనే రిజిస్ట్రేషన్.. వాహనదారులకు రిలీఫ్..
ఆర్టీసీ జేఏసీ సంచలన నిర్ణయం.. జూన్ 11 నుంచి ఆందోళనల బాట..
ఆర్టీసీ జేఏసీ సంచలన నిర్ణయం.. జూన్ 11 నుంచి ఆందోళనల బాట..
దెయ్యాలు తరిమేస్తామంటూ వచ్చారు.. కట్ చేస్తే దిమ్మతిరిగే షాక్!
దెయ్యాలు తరిమేస్తామంటూ వచ్చారు.. కట్ చేస్తే దిమ్మతిరిగే షాక్!
రెచ్చగొట్టడానికి ఇలాంటివి చేస్తున్నారు..
రెచ్చగొట్టడానికి ఇలాంటివి చేస్తున్నారు..
అత్త అందానికి ఫిదా అయిన అల్లుడు.. భార్య పక్కన పెట్టి..
అత్త అందానికి ఫిదా అయిన అల్లుడు.. భార్య పక్కన పెట్టి..
తెలివైన కుందేలు కథ.. ఉపాయంతో అపాయాన్ని జయించండి..!
తెలివైన కుందేలు కథ.. ఉపాయంతో అపాయాన్ని జయించండి..!
ఏంటి మేడమ్ ఇలా మారిపోయారు! ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?
ఏంటి మేడమ్ ఇలా మారిపోయారు! ఈ టాలీవుడ్ హీరోయిన్‌ను గుర్తు పట్టారా?