మిగతా సినిమాల సంగతేమో గాని.. సౌత్ నుంచి రాబోతున్న ఆ రెండు మోస్ట్ ఎవెయిటెడ్ మూవీస్ మీదే దేశం మొత్తం ఈగర్‌గా వెయిట్ చేస్తోంది. ఇప్పటికే రిలీజ్ డేట్ ప్రకటించినప్పటికీ.. వాళ్లకు సెకండ్ థాట్స్ కూడా వున్నట్టు వార్తలొచ్చాయ్. కానీ.. ఇప్పుడు మళ్లీ సడన్‌గా యూటర్న్ తీసుకోబోతున్నారా..? ఆ రెండు బిగ్ మూవీస్ నుంచి ఏదైనా గుడ్ న్యూస్ రాబోతోందా? తెలుసుకుందాం పదండి. వన్ మిలియన్ కామెంట్స్.. 83 లక్షల లైక్స్… మా టీజర్ ఏరోజుకారోజు చరిత్ర సృష్టిస్తోంది అంటూ మరోసారి ప్రౌడ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది టీమ్ ఆఫ్ కేజీఎఫ్2. రెగ్యులర్ అప్‌డేట్స్‌తో ప్రమోషన్‌ని సస్టెయిన్ చేస్తూ వస్తున్న మేకర్స్.. రిలీజ్ డేట్‌పై మంచి క్లారిటీతో వున్నారు. ముందు చెప్పినట్టే జూలై 16న వచ్చేస్తున్నాం అనే సంకేతాలొస్తున్నాయి కేజీఎఫ్ సర్కిల్స్ నుంచి.
ప్రొడక్షన్ వర్క్ మొత్తం ఫినిష్ చేసి, ఫైనల్ అవుట్‌పుట్ ప్రొడ్యూసర్ల చేతిలో పెట్టి.. ఇప్పుడు టోటల్ ఫోకస్ ప్రభాస్ మూవీపైనే వుంచారు డైరెక్టర్ ప్రశాంత్. ఫినిషింగ్ టచెస్ కూడా గత నెలలోనే కంప్లీట్ చేశారట. ఇటు.. జక్కన్న చేస్తున్న ట్రిపులార్ కూడా ఇండెఫినిట్‌గా వాయిదా పడ్డట్టు రిసెంట్‌గా నార్త్ మీడియాలో వార్తలొచ్చాయి. ఎన్టీయార్‌కి పాజిటివ్ వచ్చినప్పుడు ట్రిపులార్ టీమ్ ఆలోచనలో పడిందని ఒక కీలక నటుడు చెప్పినట్టు అందరూ రాసేశారు. కానీ.. జక్కన్న క్యాంప్‌లో ఇంటర్నల్‌గా వేరే టాక్ నడుస్తోందట. నేషనల్ వైడ్‌గా కోవిడ్ కేసుల సంఖ్య మూడోవంతుకు పడిపోయింది. రాష్ట్రాలన్నీ ఒక్కొక్కటిగా లాక్‌డౌన్ టెన్షన్ నుంచి రిలీవ్ అవుతున్నాయి. జూన్ సెకండ్ వీక్ తర్వాత.. సాధారణ పరిస్థితులు వచ్చేస్తాయన్న హోప్ ఇండస్ట్రీలో కనిపిస్తోంది. అటు… జూలై ఫస్ట్‌వీక్‌లో బిగ్ స్క్రీన్స్ రీఓపెనయ్యేలా లాబీయింగ్ కూడా జరుగుతోంది. అందుకే.. తమతమ ఫ్యాన్సీ డేట్స్‌ని వదులుకోకుండా.. కొత్త డేట్స్‌ని వెతుక్కునే అవసరం లేకుండా ముందుకెళ్లాలని ఆ రెండు సినిమాల మేకర్స్ డిసైడయ్యారట.
నార్త్‌లో ట్రిపులార్ అండ్ కేజీఎఫ్2 రెండు సినిమాల థియేట్రికల్ రైట్స్ ఒక్కరి దగ్గరే వుండడంతో రిలీజ్ డేట్స్‌పై డెసిషన్ మేకింగ్ ఈజీ అవుతోందట. సో.. జూలై 16న కేజీఎఫ్2, దసరా సీజన్‌లో అక్టోబర్ 13న ట్రిపులార్ మూవీ రిలీజైనా అవాక్కవ్వాల్సిన అవసరం లేదేమో..!
Also Read: మీ ఫోన్ పోయిందా? ఐఫోన్ అయినా ఆండ్రాయిడ్ అయినా.. ఏదైనా క్షణాల్లో ఇట్టే ట్రాక్ చేసి కనిపెట్టవచ్చు!