కోజికోడ్ రెస్క్యూ టీంలో 22 మందికి కరోనా

|

Aug 14, 2020 | 4:32 PM

పుణ్యం చేయబోతే పాపం ఎదురైనట్లు అపదలో ఉన్న వారిని ఆదుకున్న వారికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు.

కోజికోడ్ రెస్క్యూ టీంలో 22 మందికి కరోనా
Follow us on

పుణ్యం చేయబోతే పాపం ఎదురైనట్లు అపదలో ఉన్న వారిని ఆదుకున్న వారికి కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. గ‌త వారం కేర‌ళ‌లోని కోజికోడ్ విమానాశ్ర‌యంలో ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 18 మంది ప్ర‌యాణికులు మృతి చెందగా చాలా వరకు గాయాలపాలయ్యారు. విమానం కూడా రెండు ముక్క‌లైంది. అయితే, విమాన ప్ర‌మాదంలో చిక్కుకున్నవారిని రెస్క్యూ ఆప‌రేష‌న్‌ టీం సహాయకచర్యలు చేపట్టింది. అనేక మంది అధికారులు ఈ ఆపరేషన్ లో పాల్గొన్నారు.

ఇదిలావుంటే, ప్రపంచవ్యాప్తంగా కరోనా ప్రభావం కారంణంగా సహాయకచర్యల్లో పాల్గొన్న అధికారుల‌కు కొవిడ్ టెస్టులు నిర్వహించారు. వీరిలో 22 మందికి క‌రోనా వైర‌స్ పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు అధికారులు తెలిపారు. అధికారుల జాబితాలో జిల్లా క‌లెక్ట‌ర్‌తో పాటు లో స్థానిక పోలీసు అధికారి కూడా ఉన్న‌ట్లు మాల‌ప్పురం మెడిక‌ల్ ఆఫీస‌ర్ తెలిపారు. వందేభార‌త్ మిష‌న్‌లో భాగంగా 184 మంది ప్ర‌యాణికుల‌తో దుబాయ్ నుంచి వ‌చ్చిన విమానం.. క‌రిపుర్ విమానాశ్ర‌యంలో ల్యాండింగ్ స‌మ‌యంలో కుప్పకూలింది. ఇక, రెస్క్యూ ఆప‌రేష‌న్‌లో పాల్గొని క‌రోనా ప‌రీక్ష‌లో పాజిటివ్‌గా తేలిన వారిని క్వారెంటైన్ చేసిన‌ట్లు వైద్యాధికారులు తెలిపారు. ప్రాణాలతో బయటపడినవారిని హోం క్వారంటైన్ చేసినట్లు అధికారులు తెలిపారు.