కొలంబో వరుస పేలుళ్ల నేపథ్యంలో శ్రీలంకకు 15మందితో కూడిన వైద్య బృందాన్ని పంపి అక్కడ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం ద్వారా బాంబు దాడుల్లో క్షతగాత్రులైన బాధితులకు సహాయం అందించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి సంబంధించి పినరయ్ ప్రభుత్వం విదేశాంగ మంత్రిత్వ శాఖతో చర్చలు జరుపుతోంది. పవిత్ర ఈస్టర్ సండే రోజున విదేశీయులే లక్ష్యంగా చేసుకుని శ్రీలంకలో ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడుల్లో దాదాపు 290 మందికిపైగా మరణించగా, 500 మందికి పైగా క్షతగాత్రులయ్యారు.