ఆ రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు.. లాక్‌డౌన్ నుంచి మినహాయింపు..

| Edited By:

Apr 12, 2020 | 8:02 PM

కోవిద్ 19 కరాళ నృత్యం చేస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. లాక్‌డౌన్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన సంకలన మార్గదర్శకాలను జాబితాను కేరళ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ

ఆ రాష్ట్రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు.. లాక్‌డౌన్ నుంచి మినహాయింపు..
Follow us on

కోవిద్ 19 కరాళ నృత్యం చేస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. లాక్‌డౌన్ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన సంకలన మార్గదర్శకాలను జాబితాను కేరళ ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలను పాటించని వారిపై ప్రకృతి వైపరిత్య చట్టంతో పాటు ఐపీసీ కింద శిక్షిస్తామని పినరాయ్ ప్రభుత్వం తేల్చి చెప్పింది. అయితే 12 రాష్ట్ర ప్రభుత్వ శాఖలతో పాటు రాష్ట్రంలో ఉన్న 7 కేంద్ర ప్రభుత్వ శాఖలకు చెందిన ఉద్యోగులను ఇందుకు మినహాయింపునిచ్చింది. అంతేకాకుండా తాగునీటి సరఫరా, వ్యవసాయ కూలీలను  కూడా ఇందునుంచి మినహాయింపు నిచ్చింది.

కాగా.. వాణిజ్యంతో పాటు అత్యవసర సేవల్లో ఉన్న ప్రైవేటు విభాగాలు కూడా ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మినహాయించామని, మిగితా వారందరూ లాక్‌డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటించాల్సిందేనని తేల్చి చెప్పారు. వీటితో పాటు దహన సంస్కారాలతో పాటు మిగితా వాటిల్లో కూడా 20 మంది కంటే ఎక్కువగా గుమి గూడవద్దని, లాక్‌డౌన్ కొనసాగుతుంటుందని పినరయ్ సర్కార్ స్పష్టం చేసింది. మరోవైపు రేషన్ షాపులు, నిత్యవసర వస్తువుల దుకాణాలు, పండ్ల దుకాణాలు, కూరగాయలు, పాల కేంద్రాలు, పశుగ్రాస దుకాణాలతో పాటు ఎరువులు, రసాయనాల దుకాణాలు తెరుచుకోవచ్చని, అయితే ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకే తెరిచి ఉంచాలని నిబంధనలు విధించింది.

Also Read: కరోనా కట్టడికి.. కువైట్‌కు భార‌త వైద్య బృందం..

Also Read: లాక్ డౌన్ నేపథ్యంలో.. కర్ఫ్యూ పాస్‌లు అడిగారని.. పోలీసు చేయి నరికేశారు..