ఆర్టీసీ కార్మికులతో కేసీఆర్ లంచ్.. కానీ కండీషన్స్ అప్లై..!

|

Nov 29, 2019 | 2:55 PM

ఆర్టీసీలో యూనియన్లు అనేవి లేకుండా చేసేందుకు కేసీఆర్ పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని మొత్తం 97 డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మికులతో డిసెంబర్ 1 ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతి భవన్‌లో ఆయన సమావేశం కానున్నారు. ప్రతీ డిపో నుంచి ఐదుగురు కార్మికులను ఈ సమావేశానికి ఆహ్వానించాలని, వారికి తగిన రవాణా సౌకర్యం, భోజనాల సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఇప్పటికే కేసీఆర్ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మకు ఆదేశాలు జారీ […]

ఆర్టీసీ కార్మికులతో కేసీఆర్ లంచ్.. కానీ కండీషన్స్ అప్లై..!
Follow us on

ఆర్టీసీలో యూనియన్లు అనేవి లేకుండా చేసేందుకు కేసీఆర్ పక్కా ప్రణాళికలతో ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని మొత్తం 97 డిపోలకు చెందిన ఆర్టీసీ కార్మికులతో డిసెంబర్ 1 ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రగతి భవన్‌లో ఆయన సమావేశం కానున్నారు. ప్రతీ డిపో నుంచి ఐదుగురు కార్మికులను ఈ సమావేశానికి ఆహ్వానించాలని, వారికి తగిన రవాణా సౌకర్యం, భోజనాల సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఇప్పటికే కేసీఆర్ ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మకు ఆదేశాలు జారీ చేశారు. అంతేకాక సమావేశానికి హాజరయ్యే ఆర్టీసీ ఉద్యోగుల్లో ఖచ్చితంగా ఇద్దరు మహిళలు ఉండాలని సూచించారు.

ఈ సమావేశంలో కార్మికుల సమస్యలు, యూనియన్ల అంశం, ఆర్టీసీకి సంబంధించిన తదితర విషయాలను సీఎం కేసీఆర్ కూలంకషంగా చర్చిస్తారని తెలుస్తోంది. కాగా, ఈ సమావేశానికి రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్‌తో పాటు, ఆర్టీసీ ఎండీ, ఇ.డీ.లు, ఆర్.ఎం.లు, డివిఎంలు కూడా హాజరు కానున్నారు.