
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగన మరోసారి వార్తల్లో నిలిచింది. పంజాబీ రైతుల నిరసనల నేపథ్యంలో కంగన కామెంట్లను వ్యతిరేకిస్తూ నటుడు దిల్జీత్ దోసాంజి వరుస ట్వీట్లు చేశారు. దీంతో ఆ ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. తాజా ట్వీట్ లో కంగన మరోసారి దిల్జీత్ పై పంచ్ వేసింది.“రైతుల నిరసనలు.. ఇస్లాం అనుకూల.. భారత వ్యతిరేక చిత్ర పరిశ్రమకు చెందిన బ్రాండ్లు అన్నీ వరదలో కొట్టుకుపోతాయి” అంటూ దిల్జీత్ – ప్రియాంక చోప్రాలను ఉద్ధేశించి కంగన ట్వీట్స్ చేసింది.
దానికి కౌంటర్ గా దిల్జీత్ దోసాంజి తన ఇన్ స్టాలో “లోల్ ” “ఆఫ్టర్ ఎఫెక్ట్స్” అనే పదాలను ఉపయోగించారు. అంతటితో ఆగకుండా.. “ఈ రోజు హైదరాబాద్ లో 12 గంటల షిఫ్ట్ లో పనిచేసిన తరువాత సాయంత్రం నేను ఓ ఈవెంట్ లో హాజరు కావడానికి చెన్నైకి వెళ్లాను. అది ఒక ఛారిటీ ఈవెంట్. నేను పసుపు రంగులో ఎలా కనిపిస్తున్నాను? అంటూ యాష్ ట్యాగ్ దిల్జీత్ కిట్టే ట్విట్టర్ లో అతని కోసం వెతుకుతున్నారు. అంటూ పోస్ట్ పెట్టింది కాంగన. మరి ఈ ట్వీట్ కు దిల్జీత్ ఎలా రీప్లే ఇస్తాడో చూడాలి.
Today after working in a 12 hours shift in Hydrabad this evening I flew down to Chennai to attend a charity event, how do I look in yellow? Also #Diljit_Kitthe_aa ?
Everyone is looking for him here on twitter ? pic.twitter.com/Sbx6K4Shvb— Kangana Ranaut (@KanganaTeam) December 11, 2020