Joe Biden: మరో కీలక నిర్ణయం తీసుకున్న అమెరికా కొత్త అధ్యక్షుడు… భారతీయులకు శుభవార్త…

|

Jan 27, 2021 | 8:39 PM

Joe Biden Key Decision On H4 Visa: అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ తనదైన శైలిలో దూసుకెళుతున్నారు కొత్త అధ్యక్షుడు జో బైడెన్. అంతకు ముందు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను...

Joe Biden: మరో కీలక నిర్ణయం తీసుకున్న అమెరికా కొత్త అధ్యక్షుడు... భారతీయులకు శుభవార్త...
Follow us on

Joe Biden Key Decision On H4 Visa: అమెరికా 46వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటూ తనదైన శైలిలో దూసుకెళుతున్నారు కొత్త అధ్యక్షుడు జో బైడెన్. అంతకు ముందు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను మారుస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు బైడైన్.
తాజాగా ఇందులో భాగంగానే హెచ్1బీ వీసాదారుల జీవిత భాగస్వాములకు ఊరట కలిగించే నిర్ణయాన్ని ప్రకటించారు. అమెరికాలో హెచ్1బీ వీసా ద్వారా ఉద్యోగాలు చేస్తోన్న వారి భాగస్వాములు ఉద్యోగం చేసుకోవడం కోసం ఒకప్పుడు అమల్లో ఉన్న హెచ్4 వీసాలను కొనసాగిస్తున్నట్లు ప్రకటించారు. ఇది వరకు ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అందుబాటులో ఉన్న ఈ వెసులుబాటును ట్రంప్ తొలగించారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ నిర్ణయాన్ని సవరిస్తూ జో బైడెన్ ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే హెచ్‌1-బీ వీసాదారుల్లో ఎక్కువ శాతం ఇండియా, చైనా వాళ్లే ఉన్నారు. దీంతో బైడెన్ కొత్తగా తీసుకున్న నిర్ణయంతో భారతీయులకు మేలు జరగనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: Moon Rock in White House: అధికారిక నివాసంలో పెద్దన్న మార్పులు.. మూన్ రాక్‌పై మనసుపడ్డ పెద్దన్న జో బైడెన్