కరోనా భయంతో.. బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం..

| Edited By:

Apr 21, 2020 | 8:02 PM

కోవిద్-19 మహమ్మారి భారత్ లోనూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దేశమంతా కరోనా కర్ఫ్యూ కొనసాగుతోంది. కోవిద్-19 కారణంగా క్వారంటైన్‌లో ఉన్న ఓ వ్యక్తి ఇవాళ ఆస్పత్రిపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు.

కరోనా భయంతో.. బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం..
Follow us on

కోవిద్-19 మహమ్మారి భారత్ లోనూ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. దేశమంతా కరోనా కర్ఫ్యూ కొనసాగుతోంది. కోవిద్-19 కారణంగా క్వారంటైన్‌లో ఉన్న ఓ వ్యక్తి ఇవాళ ఆస్పత్రిపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. మూడంతస్తుల ఎత్తు నుంచి కిందికి దూకడంతో తీవ్రంగా గాయపడ్డాడు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని లేక్ వ్యూ ఆస్పత్రిలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ప్రస్తుతం అతడికి రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నామనీ.. అతడి పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని రాంచీ పోలీసులు వెల్లడించారు.

కాగా.. అతను ఎందుకు ఆత్మహత్యకు ప్రయత్నించాడన్న దానిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉందన్నారు. కాగా లేక్ వ్యూ ఆస్పత్రిలో క్వారంటైన్లో ఉన్న ఇతర వ్యక్తులు చెప్తున్నదాని ప్రకారం… కొద్దిగా కలతచెందిన అతడు ఇంటికెళ్లిపోతానంటూ తరచూ పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఇక జార్ఖండ్‌లో ఇప్పటి వరకు 46 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఇద్దరు వ్యక్తులు కరోనా కారణంగా మరణించారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 18, 601 మందికి కరోనా సోకినట్టు కేంద్రం వెల్లడించింది. వీరిలో 3,252 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లగా… 590 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలిపింది.

[svt-event date=”21/04/2020,7:40PM” class=”svt-cd-green” ]