ఆ హక్కు మీకెవరిచ్చారు.? : పవన్ కల్యాణ్

ఆంధ్ర ప్రదేశ్ లోని భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ గళమెత్తారు. నిర్మాణరంగ కార్మికుల సంక్షేమ నిధులు మళ్లించేందుకు జగన్ ప్రభుత్వానికి ఏ అధికారం ఉందని ప్రశ్నించారు. జగన్ సర్కారు..

ఆ హక్కు మీకెవరిచ్చారు.? : పవన్ కల్యాణ్

Updated on: Sep 13, 2020 | 8:49 PM

ఆంధ్ర ప్రదేశ్ లోని భవన నిర్మాణ రంగ కార్మికుల సమస్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ గళమెత్తారు. నిర్మాణరంగ కార్మికుల సంక్షేమ నిధులు మళ్లించేందుకు జగన్ ప్రభుత్వానికి ఏ అధికారం ఉందని ప్రశ్నించారు. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇసుక కొరత తలెత్తిందని.. తరువాత కోవిడ్ 19 పరిస్థితులు వచ్చాయని.. ఫలితంగా భవన నిర్మాణరంగ కార్మికులకు ఉపాధి కరవైందని పవన్ చెప్పారు.
ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాళ్లకి దక్కిన సాయం శూన్యమని పవన్ అన్నారు. భవన కార్మికుల బాగోగులను ప్రభుత్వం చూసుకోవాల్సి ఉండగా… అందుకు భిన్నంగా వారికి సంబంధించిన సంక్షేమ నిధులను మళ్లించిందని విమర్శించారు. ఆ నిధి నుంచి రూ. 450 కోట్లు మొత్తాన్ని వైసీపీ ప్రభుత్వం తన సొంత అవసరాలకు కోసం మళ్లించిందని ట్విట్టర్ వేదికగా పవన్ ఆరోపణలు చేశారు.
ఇలా చేయడం రాజ్యాంగ విరుద్ధం అవుతుందన్న పవన్.. ఇది ముమ్మాటికీ ఆంధ్ర ప్రదేశ్ ఉన్న 22 లక్షల మంది రిజిస్టర్డ్ నిర్మాణ కార్మికుల హక్కులను కాలరాయడమే.. కార్మిక చట్టాల ఉల్లంఘనే.. అని వ్యాఖ్యానించారు.