పార్టీ పై పవన్ ఫోకస్.. ఏడు కమిటీలు, ఛైర్మన్ల ప్రకటన..!

| Edited By:

Jun 25, 2019 | 10:21 AM

ఏపీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణం పై ఫోకస్ పెట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగా ఏడు కమిటీలను ప్రకటించారు. పార్టీలోని పలువురు ముఖ్యనేతలతో భేటీ అయి కమిటీలు వాటి ఛైర్మన్లను ఖరారు చేశారు. మహిళా సాధికారత కమిటీ ఛైర్మన్‌గా కర్నూలు జిల్లాకు చెందిన రేఖా గౌడ్‌ను నియమించారు. ఇప్పటివరకూ ఆమె జనసేన వీర మహిళా విభాగం చైర్‌పర్సన్‌గా ఉన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా తమిళనాడు మాజీ చీఫ్ […]

పార్టీ పై పవన్ ఫోకస్.. ఏడు కమిటీలు, ఛైర్మన్ల ప్రకటన..!
Follow us on

ఏపీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణం పై ఫోకస్ పెట్టారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగా ఏడు కమిటీలను ప్రకటించారు. పార్టీలోని పలువురు ముఖ్యనేతలతో భేటీ అయి కమిటీలు వాటి ఛైర్మన్లను ఖరారు చేశారు. మహిళా సాధికారత కమిటీ ఛైర్మన్‌గా కర్నూలు జిల్లాకు చెందిన రేఖా గౌడ్‌ను నియమించారు. ఇప్పటివరకూ ఆమె జనసేన వీర మహిళా విభాగం చైర్‌పర్సన్‌గా ఉన్నారు. లోకల్ బాడీ ఎలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా తమిళనాడు మాజీ చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు, మైనారిటీల కమిటీ ఛైర్మన్ విద్యావేత్త అర్హం ఖాన్, ఎస్సీ-ఎస్టీ ఛైర్మన్‌గా అప్పికట్ల భూషణ్‌ను నియమించారు. ప‌బ్లిక్ గ్రీవెన్స్ క‌మిటీ చైర్మ‌న్‌గా రాపాక వ‌ర‌ప్ర‌సాద్, గ‌వ‌ర్న‌మెంట్ ప్రోగ్రామ్స్ మానిట‌రింగ్ క‌మిటీ చైర్మ‌న్‌గా చింత‌ల పార్థసార‌థిలను నియమించారు. ఇక పార్టీ నిర్వహణ కమిటీ ఛైర్మన్‌గా తోట చంద్రశేఖర్ నియమించబడ్డారు. త్వరలోనే రాష్ట్ర కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ తెలిపారు.

పార్టీకి అపారమైన కేడర్ ఉన్నప్పటికీ.. అనుభవం కలిగినవారు తక్కువగా ఉండటంతో ఇప్పటివరకు పార్టీ కమిటీలను పూర్తి స్థాయిలో వేయలేకపోయామని పవన్ వెల్లడించారు. ఇప్పుడు అనుభవం ఉన్నవారు కూడా తోడవడంతో పార్టీకి పూర్తి స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, ఏడు కమిటీ ఛైర్మన్లలో ఇద్దరికి ఐఏఎస్‌లుగా పనిచేసిన అనుభవం ఉండటం చెప్పుకోదగ్గ విషయం. రామ్మోహన్ రావుతోపాటు తోట చంద్రశేఖర్ గతంలో ఐఏఎస్‌లుగా పని చేశారు.