అయోధ్య రామమందిర నిర్మాణానికి పవన్ కళ్యాణ్ భారీ విరాళం, రూ. 30 లక్షలు ఇచ్చిన జనసేనాని

|

Jan 22, 2021 | 2:21 PM

జై..శ్రీరామ్ అంటూ అయోధ్య రామమందిర నిర్మాణానికి విరాళాలు వరదలా వచ్చిపడుతున్నాయి. కుల మతాలకు అతీతంగా ప్రజలు రామాలయ..

అయోధ్య రామమందిర నిర్మాణానికి పవన్ కళ్యాణ్ భారీ విరాళం, రూ. 30 లక్షలు ఇచ్చిన జనసేనాని
Follow us on

జై..శ్రీరామ్ అంటూ అయోధ్య రామమందిర నిర్మాణానికి విరాళాలు వరదలా వచ్చిపడుతున్నాయి. కుల మతాలకు అతీతంగా ప్రజలు రామాలయ నిర్మాణానికి తమ వంతు చందాలు ఇస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టెంపుల్ నిర్మాణానికి భారీ విరాళాన్ని ప్రకటించారు. రూ. 30 లక్షల రూపాయలు తన వంతు విరాళంగా పవన్ ఇచ్చారు. ఇలా ఉండగా, దేశ విదేశాలనుంచి జనం అయోధ్య రామాలయ నిర్మాణానికి చందాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. అయితే, అయోధ్య ఆలయ నిర్మాణ ట్రస్ట్ మాత్రం కొన్ని పరిమితులకు లోబడి మాత్రమే విరాళాలు సేకరిస్తోంది.