కూరగాయల వ్యాపారికి కరోనా.. ఆందోళనలో జనం..!

కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని రామన్నపల్లిలో ఆదివారం కూరగాయలు అమ్మే వ్యక్తికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు.

కూరగాయల వ్యాపారికి కరోనా.. ఆందోళనలో జనం..!

Updated on: Jun 21, 2020 | 5:29 PM

చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా గ్రామీణ ప్రాంతాలను వదలడం లేదు. తాజాగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని రామన్నపల్లిలో ఆదివారం కూరగాయలు అమ్మే వ్యక్తికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. అతను ప్రతి రోజు ఊరంతా మోటార్ సైకిల్ పై తిరుగుతూ కూరగాయలు అమ్ముతాడని అధికారులు గుర్తించారు. అతన్ని కాంటాక్ట్ అయిన వారిని వెతికే పనిలో పడ్డారు అధికారులు. దీంతో అత‌డి ద‌గ్గ‌ర కూర‌గాయ‌లు కొన్న‌ జనం ఆందోళ‌న చెందుతున్నారు. ఇప్పటివరకు 20 మంది ప్రైమరీ కాంటాక్టులను గుర్తించిన అధికారులు వారిని హోమ్ క్వారంటైన్ చేశారు. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో అధికారులు సోడియం హైపో క్లోరైడ్ తో శానిటేషన్ చేస్తున్నారు.