అనుష్కతో కొత్త భంగిమలు ట్రై చేయలేదా.? కోహ్లీపై రచయిత్రి బూతు ట్వీట్!

|

Jan 19, 2020 | 12:44 PM

ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పలు ప్రయోగాలు చేసిన సంగతి తెలిసిందే. ఎప్పుడు మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అతడు తొలి వన్డేలో మాత్రం నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు. ఇక ఆ మ్యాచ్‌లో ఆసీస్ 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అయితే రెండో వన్డేలో మాత్రం ప్రయోగాల జోలికి వెళ్లకుండా కోహ్లీ ఎప్పటిలానే వన్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగడమే కాకుండా తనదైన మార్క్ ఇన్నింగ్స్‌తో సత్తా చాటాడు. తద్వారా […]

అనుష్కతో కొత్త భంగిమలు ట్రై చేయలేదా.? కోహ్లీపై రచయిత్రి బూతు ట్వీట్!
Follow us on

ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పలు ప్రయోగాలు చేసిన సంగతి తెలిసిందే. ఎప్పుడు మూడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అతడు తొలి వన్డేలో మాత్రం నాలుగో స్థానంలో బరిలోకి దిగాడు. ఇక ఆ మ్యాచ్‌లో ఆసీస్ 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. అయితే రెండో వన్డేలో మాత్రం ప్రయోగాల జోలికి వెళ్లకుండా కోహ్లీ ఎప్పటిలానే వన్ డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగడమే కాకుండా తనదైన మార్క్ ఇన్నింగ్స్‌తో సత్తా చాటాడు.

తద్వారా మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. అసలు ఇదంతా ఎందుకు చెబుతున్నానని అనుకుంటున్నారా.. ఓ ప్రముఖ రచయిత్రి కోహ్లీ ప్రయోగాలను శృంగార భంగిమలతో పోలుస్తూ ట్వీట్ చేయడమే కాకుండా అతడి భార్య అనుష్క శర్మను కూడా లాగి తన పైత్యాన్ని చాటుకుంది.

రెండు వన్డేల గెలుపోటములను విశ్లేషిస్తూ రచయిత్రి భావన అరోరా.. ‘ఆస్ట్రేలియన్లతో విరాట్ కోహ్లీ సరికొత్త పొజిషన్లు ప్రయత్నిస్తూ.. తనతో ఆ పని చేయకపోవడం వల్లే అనుష్క శర్మ కోపంతో ఉంది’ అని డబుల్ మీనింగ్ ట్వీట్‌ను పోస్ట్ చేసింది. జట్టు విజయాల కోసం విరాట్ కోహ్లీ ప్రయోగాలు చేస్తే.. దాన్ని ఈమె ఇలా వెక్కిరించడంతో నెటిజన్లు ఒక ఆట ఆడుకున్నారు.